తీవ్ర సంక్షోభం తప్పదు.. కియోసాకి హెచ్చరిక | Rich Dad Poor Dad Robert Kiyosaki Warns Youth Don't Waste Greatest Assets | Sakshi
Sakshi News home page

తీవ్ర సంక్షోభం తప్పదు.. కియోసాకి హెచ్చరిక

Mar 23 2026 1:58 PM | Updated on Mar 23 2026 2:24 PM

Rich Dad Poor Dad Robert Kiyosaki Warns Youth Don't Waste Greatest Assets

ప్రముఖ ఆర్థిక నిపుణుడు, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి ఆర్థిక ప్రణాళికపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో ఉన్నవారు ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోతే ఎదురయ్యే పరిణామాలను ఆయన తన తాజా సోషల్ మీడియా పోస్ట్‌లో వివరించారు.

నిర్లక్ష్యం.. నిశ్శబ్ద శత్రువు!
తన కుటుంబ సభ్యురాలితో జరిగిన ఒక చర్చను ఉదహరిస్తూ.. "చాలా మంది ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని గుర్తించడం లేదు" అని కియోసాకి (Robert Kiyosaki) ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 80 ఏళ్ల వయస్సు ఉండి, ఎటువంటి పొదుపు లేకుండా, ఇప్పటికీ పని చేయాల్సిన పరిస్థితిలో ఉన్నప్పటికీ.. చాలామంది "ఏం పర్వాలేదు.. సంతోషంగా ఉంటే చాలు (Don't worry, be happy)" అనే ధోరణిలో ఉండటం ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.

యువతకు విలువైన హెచ్చరిక
ఆర్థిక సంక్షోభం ఎప్పుడైనా రావచ్చని, దాన్ని ఎదుర్కోవడానికి యువతకు ఉన్న అతిపెద్ద ఆస్తి "సమయం" అని ఆయన గుర్తు చేశారు. సమయం, ఆరోగ్యం.. ఇవే మనిషికి ఉన్న గొప్ప ఆస్తులు. వీటిని వృథా చేయకుండా పెట్టుబడిగా మార్చుకోవాలి.

తాను 28 ఏళ్ల వయస్సులో ఇల్లు లేకుండా, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని.. కానీ ఆ వయస్సులో తాను నేర్చుకున్న పాఠాలే నేటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవడానికి సహాయపడుతున్నాయని ఆయన వివరించారు.

ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరం!
ప్రపంచ దేశాల్లో ముద్రిస్తున్న 'నకిలీ కరెన్సీ' (ఫేక్ మనీ), పెరుగుతున్న జాతీయ అప్పులు, స్టాక్ మార్కెట్ కుప్పకూలే అవకాశాలను విస్మరించడం తెలివైన పని కాదని కియోసాకి హెచ్చరించారు. వయస్సు పెరిగే కొద్దీ కొత్తగా సంపాదించే సామర్థ్యం తగ్గుతుందని, అందుకే యువత తమ సమయాన్ని తెలివిగా ఖర్చు చేయాలని ఆయన సూచించారు.

"వయస్సును, మీకు ఉన్న సమయాన్ని గౌరవించండి. ఆరోగ్యం, యవ్వనం ఉన్నప్పుడే సరైన ఆర్థిక పునాదులు వేసుకోకపోతే, రిటైర్మెంట్ సమయంలో తీవ్ర ఇబ్బందులు తప్పవు" అన్నది కియోసాకి మాటల సారాంశం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement