‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) రచయిత రాబర్ట్ కియోసాకి మరోసారి బిట్‌కాయిన్‌పై తన విశ్వాసాన్ని ‘రెట్టింపు’ చేశారు. క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్ విలువ ఈ ఏడాది రెట్టింపు అవుతుందని, బహుశా 2 లక్షల డాలర్లకు చేరవచ్చని అంచనా వేశారు. అలాగే ఎందుకు చాలామంది నష్టాల్లోనే మిగిలిపోతున్నారన్నది కూడా వివరించారు.
రాబర్ట్ కియోసాకి బిట్ (Robert Kiyosaki) తాజాగా ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్)లో మరో ఆసక్తికర పోస్ట్ చేశారు. ‘బిట్ కాయిన్ ధర ఈ సంవత్సరం రెట్టింపు కావచ్చు.. బహుశా 2 లక్షల డాలర్లకు చేరవచ్చు’, ‘నష్టపోతున్నవారు నష్టపోతూనే ఉంటారు ఎందుకంటే వారిలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ లేదా "ఈక్యూ" లోపించింది’ అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తన మిత్రునితో జరిగిన వ్యక్తిగత అనుభవాన్ని కియోసాకి పంచుకున్నారు. కొన్నేళ్ల క్రితంఓసారి తన స్నేహితుడికి తన కాయిన్ బేస్ యాప్‌ను చూపించానని, అదప్పడు అంత మెరుగ్గా లేదని రాసుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆ అకౌంట్‌లో లక్షల బిట్ కాయిన్లు (Bitcoin) ఉన్నాయని వివరించారు. అయితే అతనప్పుడు చూడగలిగింది వేలల్లో నష్టాలనే.. కానీ మిలియన్లలో లాభాలను అతను చూడలేకపోయాడని తాను గుర్తించినట్లు రాసుకొచ్చారు.
ధనిక, పేద, మధ్యతరగతి మధ్య తేడా అదే..
‘ఆ మానసిక భావోద్వేగ వ్యత్యాసమే ధనిక, పేద, మధ్యతరగతి మధ్య కీలకమైన వ్యత్యాసం’ అని కియోసాకి పేర్కొన్నారు. "దీనినే ఈక్యూ లేదా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు" అని వివరాంచారు. కియోసాకి అభిప్రాయం ప్రకారం.. "పేదలకు తక్కువ ఈక్యూ ఉంటుంది. వారు భయం అనే భావోద్వేగంలో ఉంటున్నారు". అదే "ధనవంతులకు 'భయం', ఆశ' రెండింటి గురించీ తెలుసు. ఈ రెండు ఈక్యూలు మనందరికీ ఉండేవే. సంపన్నులు, విజేతలు ఈ రెండు ఈక్యూలను గౌరవిస్తారు".
"ఈక్యూ.. ఐక్యూ కంటే శక్తివంతమైనది. అందుకే నా ‘పూర్ డాడ్’ వంటి చాలా మంది ఉన్నత విద్యావంతులు కూడా పేదలుగానే గతిస్తున్నారు" అని కియోసాకి ఉదహరించారు. "ఆర్థిక ప్రపంచంలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది ఐక్యూ కంటే ముఖ్యమైనది" అన్నారు.
ఇదీ చదవండి: ‘బంగారం, వెండి క్రాష్ అంటూ భయపెడుతున్నారు’
యు.ఎస్. ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయం, యూఎస్-చైనా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితికి ముందు లిక్విడేషన్ల ద్వారా స్వల్పకాలిక అస్థిరతతో బిట్ కాయిన్ విలువ బుధవారం (అక్టోబర్ 29) 1,13,125 డాలర్ల వద్ద కదులుతున్న నేపథ్యంలో కియోసాకి నుంయి ఈ బుల్లిష్ వ్యాఖ్యలు వచ్చాయి.
WHY LOSERS lose:
I was showing a friend my coin base app, explaining that a few years ago it was pathetic. Today my app showed my friend I have millions in Bitcoin…. and I think Bitcoin will double in price this year…. Possibly a high of $200k.
Although my coin base showed I…— Robert Kiyosaki (@theRealKiyosaki) October 29, 2025


