ప్రఖ్యాత రచయిత, ఆర్థిక విద్యావేత్త రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki).. తన బెస్ట్ సెల్లింగ్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad)కు ప్రసిద్ధి చెందారు. డబ్బు, భద్రత, విజయంపై సమాజం దీర్ఘకాల నమ్మకాల గురించి మరోసారి సోషల్ మీడియాలో చర్చను రేకెత్తించారు.
రాబర్ట్ కియోసాకి తాజాగా ‘ఎక్స్’(గతంలో ట్విట్టర్) లో ఒక పోస్ట్ చేశారు. "ఇప్పటివరకు చెప్పిన అతిపెద్ద అబద్ధాలు" ఇవే అంటూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. అవి.
"వాళ్లు ఎప్పటికీ సంతోషంగా ఉంటున్నారు
బాండ్లు సురక్షితం.
బ్యాంకులో డబ్బు సురక్షితం.
నాకు ఉద్యోగ భద్రత ఉంది.
కళాశాల డిగ్రీ ఆర్థిక విజయానికి కీలకం"
ఈ ట్వీట్ వెంటనే వైరల్ అయింది. ఆయన ప్రస్తావించిన ప్రతి పాయింట్ ను చర్చించడంతో వేలాది లైక్‌లు, షేర్లు వచ్చాయి. కియోసాకి సందేశం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ ప్రధాన తత్వాన్ని ప్రతిధ్వనిస్తుంది. సాంప్రదాయ ఉపాధి విద్య వ్యవస్థల కంటే ఆర్థిక స్వాతంత్ర్యం పెట్టుబడి అక్షరాస్యత సంపదకు మరింత నమ్మదగిన మార్గాలు అన్నది కియోసాకి అభిప్రాయం.
👉 ఇది చదవలేదా ఇంకా: అదిగో భారీ క్రాష్.. ‘రిచ్ డాడ్’ వార్నింగ్!
BIGGEST LIES EVER TOLD:
1: “They lived happily ever after.”
2: “Bonds are safe.”
3: “Safe as money in the bank.”
4: “I have job security.”
5: “ A college degree is the key to financial success.”— Robert Kiyosaki (@theRealKiyosaki) November 2, 2025


