ప్రముఖ పర్సనల్ ఫైనాన్స్ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Robert Kiyosaki) రచయిత, ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి ( Robert Kiyosaki) ఒక ప్రసిద్ధ పెట్టుబడి సూత్రాన్ని విమర్శించారు. చాలామంది ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ‘డైవర్సిఫికేషన్’ చేశామని భావిస్తుంటారని, వాస్తవానికి వారు ‘డీ-వర్స్-ఇఫికేషన్’ (పరిస్థితిని మరింత దిగజార్చే ప్రక్రియ) చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులో కియోసాకి.. బంగారం, వెండి, బిట్‌కాయిన్, స్టాక్స్, బాండ్లు, రియల్ ఎస్టేట్, చమురు వంటి విభిన్న ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టినప్పటికీ అవన్నీ ఈటీఎఫ్‌లు, ఆర్‌ఈఐటీలు లేదా ఇతర ఆర్థిక సాధనాల రూపంలో ఉంటే అవి చివరికి ఒకే “పేపర్ అసెట్” వర్గానికి చెందినవేనని అన్నారు. అలాంటి పెట్టుబడులు నిజమైన డైవర్సిఫికేషన్ కాదని, కేవలం తాము పెట్టుబడులను వైవిధ్యీకరించామని ఇన్వెస్టర్లు భావించే పరిస్థితి మాత్రమేనని వివరించారు.
తాను మాత్రం నేరుగా యాజమాన్యం, నియంత్రణ, కస్టడీ తన చేతుల్లో ఉండే “రియల్ అసెట్స్”ను ఇష్టపడతానని కియోసాకి పేర్కొన్నారు. బంగారం, వెండి, రియల్ ఎస్టేట్ లేదా ఇతర భౌతిక ఆస్తులను నేరుగా కలిగి ఉండటం కోసం కొంత ఎక్కువ ఖర్చు, సమయం వెచ్చించాల్సి వచ్చినా, వాటి గురించి మరింత అధ్యయనం చేసే అవకాశం లభిస్తుందని రాసుకొచ్చారు.
“ఇది నా వ్యక్తిగత పెట్టుబడి విధానం. కొంతమంది దీనిని నా జాగ్రత్త లేదా అనుమాన స్వభావంగా చూడొచ్చు. కానీ నా ఎంపిక ఇదే. మీ ఎంపిక ఏమిటి? డైవర్సిఫికేషన్‌నా? లేక డీ-వర్స్-ఇఫికేషన్‌నా?” అంటూ పెట్టుబడిదారులను కియోసాకి ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు ఇన్వెస్టర్లలో ఈటీఎఫ్‌లు, డెరివేటివ్ ఉత్పత్తులు, భౌతిక ఆస్తులపై మరోసారి చర్చకు దారితీశాయి.
DEWORSE-IFIED is not Diversified.
Many people are “De-Worsified” not “Diversified.”
“De-Worse-ified” means they think they are diversified, but they have all their “diversified” assets, such as gold, silver, Bitcoin, stocks, bonds, real estate, and oil, in one asset class….the…— Robert Kiyosaki (@theRealKiyosaki) June 9, 2026


