Diversification
-
మల్టీ అసెట్ ఫండ్స్‌తో పెట్టుబడుల్లో వైవిధ్యం..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని పాటించేందుకు మల్టీ అసెట్ ఫండ్స్‌కి గణనీయంగా ఆదరణ పెరుగుతున్నట్లు యాక్సిస్ ఎంఎఫ్ ఫండ్ మేనేజర్ ఆశీష్ నాయక్ తెలిపారు. ఫండ్ సంస్థల సమాఖ్య యాంఫీ గణాంకాల ప్రకారం 2026 ఫిబ్రవరిలో ఈ ఫండ్స్‌లోకి రూ. 8,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. దీనితో ఈ కేటగిరీ నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 1.83 లక్షల కోట్లకు చేరిందని ఆయన చెప్పారు. ఫోలియోల సంఖ్య 49.1 లక్షలకు చేరినట్లు వివరించారు. వరుసగా నాలుగో నెలా హైబ్రిడ్ కేటగిరీకి మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్స్ సారథ్యం వహించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ తరహా ఫండ్స్ ప్రధానంగా ఈక్విటీ, డెట్, కమోడిటీస్ (పసిడి లేదా వెండి)లో ఇన్వెస్ట్ చేస్తాయని నాయక్ వివరించారు. సాధారణంగా వివిధ సందర్భాల్లో వీటిలో ఒక్కొక్కటి ఒక్కో రకంగా స్పందిస్తాయని చెప్పారు. కార్పొరేట్ ఆదాయాలు బాగున్నప్పుడు ఈక్విటీలు పెరుగుతాయని, అలాగే వడ్డీ రేట్లు పెరిగినప్పుడు లేదా మార్కెట్లలో అనిశ్చితి నెలకొన్నప్పుడు డెట్ సాధనాలు ఆకర్షణీయంగా ఉంటాయని వివరించారు. ఇక ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్నా, అంతర్జాతీయంగా అనిశి్చతులు నెలకొన్నా పసిడి పెరుగుతుందని పేర్కొన్నారు. గత రెండేళ్లుగా దేశీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయని వివరించారు. ‘‘ఈక్విటీ వేల్యుయేషన్స్ భారీ స్థాయిలో పెరిగిపోగా, వడ్డీ రేట్లపై ఎలాంటి నిర్ణయాలు ఉంటాయోనని డెట్ ఇన్వెస్టర్లు ఆచి తూచి వ్యవహరిస్తూ వస్తున్నారు. గ్లోబల్‌గా అనిశి్చతితో కమోడిటీల రేట్లపై అనిశ్చితి నెలకొనడం పరిస్థితిని మరింత జటిలంగా మార్చింది’’ అని ఆయన తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఒకే సాధనంలో ఇన్వెస్ట్ చేసిన వారికన్నా మల్టీ అసెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన మదుపరుల పోర్ట్‌ఫోలియోల్లో ఒడిదుడుకులు కొంత తక్కువగా ఉన్నట్లు వివరించారు. ఇలా ఒకే ఫండ్ ద్వారా వివిధ అసెట్స్‌కి కేటాయింపులు జరిపే వ్యూహం దీర్ఘకాలికంగా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఇన్వెస్టర్లు, అడ్వైజర్లు గుర్తిస్తున్నారని నాయక్ చెప్పారు. అయితే, ఈ కోవకి చెందిన ఫండ్స్ అన్నీ ఒకే రకంగా పని చేయవని గుర్తుంచుకోవాలని సూచించారు. కొన్ని ఈక్విటీలవైపు ఎక్కువగా మొగ్గు చూపితే మరికొన్ని బ్యాలెన్స్డ్గా లేదా వ్యవహరిస్తాయని చెప్పారు. అలాగే కేవలం బుల్ మార్కెట్‌కే పరిమితం కాకుండా గతంలో వివిధ పరిస్థితుల్లో ఫండ్ ఎలా పని చేసిందనేది కూడా పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నారు. -
పెట్టుబడులకు చక్కని వైవిధ్యం
పెట్టుబడులకు వైవిధ్యం ఎంతో అవసరం. దీని వల్ల నష్టాల రిస్క్‌ను గణనీయంగా తగ్గించుకోవచ్చు. అన్ని పెట్టుబడులను ఒకే చోట పెట్టడం కంటే.. వివిధ విభాగాల్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల నష్టాల రిస్క తగ్గుతుంది. ఒకే ఫండ్‌తో చక్కని వైవిధ్యం కోరుకునే వారికి పరాగ్ పారిఖ్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ చక్కగా సరిపోతుంది. దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులతో, తక్కువ నష్టాల రిస్‌్కతో ఈ పథకం మెరుగ్గా రాణిస్తోంది.రాబడులుఈ పథకానికి మంచి రాబడుల చరిత్రే ఉంది. ఈ పథకం 2013లో ఆరంభం కాగా, నాటి నుంచి నేటి వరకు ఏటా సగటున 19 శాతం చొప్పున రాబడులను అందించింది. గత ఐదేళ్లలోనూ రాబడి ఇదే స్థాయిలో ఉంది. మూడేళ్లలో మాత్రం ఏటా 20.94 శాతం చొప్పున, ఏడాది కాలంలో 10 శాతం మేర పెట్టుబడులపై ప్రతిఫలాన్ని అందించింది. ఫ్లెక్సీక్యాప్ విభాగం సగటు రాబడి కంటే 6 శాతం వరకు అధిక ప్రతిఫలం ఈ పథకంలోనే ఉండడం గమనించొచ్చు.పెట్టుబడుల విధానంమంచి రాబడుల అవకాశాలు ఎక్కడ ఉంటే అక్కడ ఇన్వెస్ట్ చేసే స్వేచ్ఛ ఈ ఫండ్‌కు ఉంది. స్థానిక కంపెనీలతో పాటు విదేశీ కంపెనీల్లోనూ ఇన్వెస్ట్ చేయడం ఈ పథకం పెట్టుబడుల విధానంలో భాగం. ముఖ్యంగా అమెరికాకు చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీల్లో ఈ పథకం చెప్పుకోతగ్గ స్థాయిలో ఇన్వెస్ట్ చేసింది. అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్, ఫేస్బుక్లో ఈ పథకానికి గణనీయమైన పెట్టుబడులు ఉన్నాయి. వ్యాల్యూ స్టాక్స్‌కు ఈ పథకం ప్రాధాన్యం ఇస్తుంటుంది. అంటే కంపెనీ వ్యాపారం, మూలాల పరంగా మంచి విలువ కలిగి, ఆకర్షణీయమైన ధరల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేయడం ద్వారా అధిక రాబడులు తెచ్చిపెట్టే వ్యూహాన్ని పాటిస్తోంది.వాస్తవ విలువలకు మించి గరిష్ట స్థాయిల్లో ట్రేడవుతున్న స్టాక్స్‌కు దూరంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్‌్కను సాధ్యమైనంత తగ్గించే విధంగా పనిచేస్తుంది. స్టాక్స్‌ను తరచూ మార్చదు. ఒక కౌంటర్లో దీర్ఘకాలం పాటు కొనసాగడాన్ని పాటిస్తుంది. స్థూల ఆర్థిక అంశాలు కాకుండా.. ఎంతో విలువ దాగున్న స్టాక్స్‌ను గుర్తించి పెట్టుబడులు పెడుతుంటుంది. పరిస్థితులకు అనుగుణంగా డెట్ సెక్యూరిటీలు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌లలో (రీట్)నూ ఇన్వెస్ట్ చేస్తుంటుంది. మధ్యకాల లక్ష్యాలకు (5–7 ఏళ్లు) దీర్ఘకాల లక్ష్యాలకు (10 ఏళ్లకు అంతకుమించి) ఈ పథకాన్ని ఎంపిక చేసుకోవచ్చు.పోర్ట్ఫోలియోప్రస్తుతం ఈ పథకం నిర్వహణలో రూ.1,33,970 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 77.32 శాతం ఈక్విటీల్లో, డెట్ సాధనాల్లో 13.71 శాతం, ఈక్విటీ హెడ్జింగ్ ఇన్స్ట్రుమెంట్లలో 2.53 శాతం, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్)లలో 1.33 శాతం చొప్పున పెట్టుబడులు పెట్టింది. 5.11 శాతం నగదు నిల్వలు ఉన్నాయి. రంగాల వారీ పెట్టుబడులను పరిశీలిస్తే.. అత్యధికంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగ కంపెనీలకు 33.80 శాతం, టెక్నాలజీ రంగ కంపెనీలకు 25.29 శాతం, కన్జ్యూమర్ డిస్క్రిషినరీ కంపెనీలకు 7.48 శాతం చొప్పున కేటాయించింది. ప్రతినెలా రూ.1000 నుంచి సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. -
అమెరికా నుంచి నాణ్యమైన బొగ్గు
అమెరికా నుంచి నాణ్యమైన కోకింగ్ కోల్ దిగుమతి పట్ల ఆసక్తిగా ఉన్నట్టు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. చమురు, బొగ్గు కొనుగోలును భారత్ మరిన్ని దేశాల మధ్య వైవిధ్యం చేసుకోవాలని చూస్తున్నట్టు చెప్పారు. వీటి కోసం రెండు మూడు భౌగోళిక ప్రాంతాలపైనే ఆధారపడి ఉన్నట్టు, దీని కారణంగా ధరల్లో అస్థిరతలు ఉంటున్నట్టు పేర్కొన్నారు. భారత ఆర్థిక వృద్ధికి అవసరమైన వస్తువులు కొన్నింటిని అమెరికా అందించగలదన్నారు.ఏఐ అప్లికేషన్లకు గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు (జీపీయూలు), డేటా సెంటర్ల ఎక్విప్మెంట్, అత్యధిక పనితీరుతో కూడిన కంప్యూటింగ్ అవసరాన్ని ప్రస్తావించారు. అమెరికా పోటీ పడలేని ఉత్పత్తులను భారత్ తయారు చేయగలదని, పెట్టుబడులు, టెక్నాలజీ వనరుల పరంగా అమెరికా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ముంబైలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి గోయల్ మాట్లాడారు.వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 100 బిలియన్ డాలర్ల విమానాలకు ఇప్పటికే డిమాండ్ ఉందని.. స్థానిక సామర్థ్యాలను మరింత పెంచాల్సి ఉందని చెప్పారు. ఇటీవలే భారత్–అమెరికా మధ్య తొలి దశ ద్వైపాక్షిక ఒప్పందానికి అంగీకారం కుదరడం తెలిసిందే. దీని కింద వచ్చే ఐదేళ్లలో అమెరికా నుంచి 500 బిలియన్ డాలర్ల వస్తువులను భారత్ కొనుగోలు చేయనుంది. వచ్చే వారంలో భారత బృందం అమెరికా పర్యటనకు వెళ్లనుంది. ఒప్పందానికి సంబంధించి తుది పత్రాలను ఖరారు చేయనుంది. దీనిపై మార్చిలో ఇరు దేశాలు సంతకాలు చేయనున్నాయి. అమెరికాతో ఒప్పందం వల్ల భారత సంస్థలకు పెద్ద ఎత్తున అవకాశాలు రానున్నట్టు మంత్రి గోయల్ చెప్పారు. ముఖ్యంగా కారి్మక ఆధారిత రంగాలు, టెక్నాలజీ సేవలకు డిమాండ్ ఉంటుందన్నారు.ఇదీ చదవండి: ఏఐ.. మనిషికి సూపర్ పవర్! -
విదేశీ ‘స్టాక్స్’ షాపింగ్ చేద్దామా!
‘పెట్టుబడుల్లో ఉచితంగా వచ్చేది ఏదైనా ఉందంటే అది వైవిధ్యమే’ అన్నది ఆధునిక ఫైనాన్స్‌కు పితామహుడిగా చెప్పుకునే, నోబెల్ పురస్కార గ్రహీత హ్యారీ మర్కోవిజ్ అభిప్రాయం. వైవిధ్యం అంటే పెట్టుబడులన్నింటినీ తీసుకెళ్లి ఏదో ఒక సాధనంలో ఉంచకపోవడం. మార్కెట్ అస్థిరతలు, ఊహించని నష్టాల నుంచి పెట్టుబడులకు ఈ వైవిధ్యమే రక్షణ కవచంలా పనిచేస్తుంది. ఈక్విటీలు, ఎఫ్డీలు, బాండ్లు, బంగారం, రియల్ ఎస్టేట్ ఇలా భిన్న సాధనాల మధ్య పెట్టుబడులను వర్గీకరించుకోవాలి. ఇక ఈక్విటీ పెట్టుబడుల్లోనూ కొంత మేర అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ వైవిధ్యాన్ని మరింత విస్తృతం చేసుకున్నట్టు అవుతుంది.భారత్ శరవేగంగా వృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటప్పుడు ఈక్విటీ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని వేరే దేశానికి ఎందుకు కేటాయించుకోవడం అన్న సందేహం రావచ్చు. కానీ, ఒక మార్కెట్‌కే పరిమితం కావడం వల్ల ఆ దేశానికి సంబంధించి ఆర్థికపరమైన రిస్క్‌ల ప్రభావం పెట్టుబడులపై అధికంగా ఉంటుంది. ఇది రాబడులపైనా ప్రభావం చూపిస్తుంది. గడిచిన నాలుగైదేళ్ల కాలాన్ని పరిశీలిస్తే.. నిఫ్టీ 50 సూచీ కంటే అమెరికా ఎస్అండ్పీ 500 (ప్రధాన సూచీ) అధిక రాబడులు అందించింది. ఇదే కాలంలో అమెరికా వృద్ధి రేటు కంటే భారత్ వృద్ధి రేటు మూడు రెట్లు అధికం. అయినా కానీ, రాబడుల్లో ఎస్అండ్పీ సూచీయే ముందుంది. దిగ్గజ టెక్నాలజీ కంపెనీలకు చిరునామా అమెరికా స్టాక్ మార్కెట్. అలాంటి గొప్ప కంపెనీల్లో పెట్టుబడులతో వైవిధ్యం మరింత బలపడుతుందన్నది నిపుణుల సూచన. ఈక్విటీ పెట్టుబడుల వైవిధ్యంతో వచ్చే ప్రయోజనాలపై అవగాహన కలి్పంచే కథనమే ఇది. వైవిధ్యం ఎందుకు..? భారత్‌కు వెలుపల ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది ఇన్వెస్టర్ రిస్క్ సామర్థ్యం ఆధారంగానే ఉంటుంది. గడిచిన రెండు మూడు దశాబ్దాల కాలంలో అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లను పరిశీలిస్తే.. గొప్ప పనితీరు చూపించిన రెండు మార్కెట్లు భారత్, అమెరికా. అందుకే ఈ రెండు ఈక్విటీ మార్కెట్ల మధ్య పెట్టుబడులను వైవిధ్యం చేసుకోవడం మెరుగైన నిర్ణయం అవుతుంది. రిస్క్ సమతుల్యతతోపాటు గొప్ప రాబడుల అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. అమెరికా, భారత్ ఈక్విటీలు గత 20 ఏళ్ల కాలంలో గొప్ప రాబడులు ఇచి్చనప్పటికీ వీటి మధ్య సహ సంబంధం తక్కువ. అభివృద్ధి చెందిన ఈక్విటీ మార్కెట్లకు, భారత్‌కు మధ్య పనితీరు విషయంలో 60–80 శాతం వరకు పరస్పర సంబంధం ఉంటోంది. అదే అమెరికాకు వచ్చేటప్పటికి (2008 ఆరి్థక మాంద్యం, కరోనా మినహా) ఇది 50 శాతమే. కనుక రిస్క్, రాబడులను బ్యాలన్స్ చేసుకోవడమే కాదు.. రెండు ఆరి్థక వ్యవస్థల్లోని అనుకూలతల నుంచి ప్రయోజనాలు పొందొచ్చు.రూపాయి క్షీణతకు హెడ్జింగ్ ప్రతి కొన్నేళ్లకోసారి యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు బాటలో నడుస్తుంటుంది. ఆ సమయంలో భారత్ సహా వర్ధమాన దేశాల కరెన్సీలతో పోలి్చతే యూఎస్ డాలర్ బలోపేతం కావడం గమనించొచ్చు. 2011లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 45 డాలర్ల వద్ద ఉంది. ఇప్పుడు 84 డాలర్లను దాటేసింది. ట్రంప్ 2.0 నాలుగేళ్ల పాలనలో రూపాయి మరో 6–8 శాతం క్షీణిస్తుందన్న అంచనాలున్నాయి. అమెరికా ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి రూపాయి విలువ క్షీణతతో రెండు రకాల ప్రయోజనాలు లభిస్తాయి. అమెరికా ఈక్విటీల్లో పెట్టుబడుల వృద్ధికితోడు.. పెట్టుబడుల ఉపసంహరణతో మరిన్ని రూపాయిలు (విలువ క్షీణత వల్ల) చేతికి వస్తాయి. రూపాయి విలువ క్షీణత అన్నది యూఎస్ ఈక్విటీ రాబడులను ఇతోధికం చేస్తుంది. సాధారణంగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు క్రమంలో విదేశీ ఇన్వెస్టర్లు వర్ధమాన మార్కెట్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకుంటుంటారు. ఆ సమయంలో మన ఈక్విటీలు ప్రతికూలతలను చూస్తుంటాయి.భవిష్యత్ అవసరాల కోసం.. మన దేశం నుంచి ఏటా వేల సంఖ్యలో విద్యార్థులు అమెరికాకు వెళుతున్నారు. అంతేకాదు విద్య అనంతరం ఉపాధి కోసం వెళుతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. ఇలాంటి వారికి యూఎస్ పెట్టుబడులు అనుకూలం. అధిక ఆదాయ వర్గాలు విదేశీ పర్యటనలకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయి. ఇందుకోసం డాలర్ల రూపంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. పిల్లలను విదేశాల్లో చదివించుకోవాలంటే యూఎస్ డాలర్ మారకంలోనే చెల్లింపులు చేయాల్సి వస్తుంది. విదేశీ కోర్సుల వ్యయం ఏటా నిరీ్ణత శాతం మేర పెరుగుతుంది. అదే సమయంలో ఏటా రూపాయి విలువ క్షీణతతో ఆ విద్యా వ్యయం ఇంకాస్త అధికమవుతోంది. అందుకే డాలర్ మారకంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రూపాయి విలువ క్షీణతతో ఏర్పడే భారాన్ని తొలగించుకోవచ్చు. రూపాయి అస్థిరతలను తగ్గించుకోవచ్చు. ఎలా ఇన్వెస్ట్ చేయాలి..? భారత స్టాక్స్ మాదిరే నేరుగా అమెరికా స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా మ్యూచువల్ ఫండ్స్/ఈటీఎఫ్‌ల ద్వారా ఎక్స్పోజర్ తీసుకోవచ్చు. యూఎస్ స్టాక్ బ్రోకర్లతో మన దేశ స్టాక్ బ్రోకర్లు కొందరికి ఒప్పందాలు ఉన్నాయి. అలాంటి దేశీ బ్రోకర్ ద్వారా అకౌంట్ ప్రారంభించి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మోతీలాల్ ఓస్వాల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తదితర సంస్థలు ఈ సేవలు అందిస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్ → యాక్సిస్ నాస్డాక్ 100 ఎఫ్‌వోఎఫ్ → ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ నాస్డాక్ 100 ఎఫ్‌వోఎఫ్ → బంధన్ యూఎస్ ఈక్విటీ ఎఫ్‌వోఎఫ్ → ఎడెల్వీజ్ యూఎస్ టెక్నాలజీ ఈక్విటీ ఎఫ్‌వోఎఫ్ → కోటక్ నాస్డాక్ 100 ఎఫ్‌వోఎఫ్, → ఫ్రాంక్లిన్ ఇండియా ఫీడర్ ఫ్రాంక్లిన్ యూఎస్ అపార్చునిటీస్ ఫండ్ → మోతీలాల్ ఓస్వాల్ నాస్డాక్ 100 ఎఫ్‌వోఎఫ్ → ఇన్వెస్కో ఇండియా నాస్డాక్ 100 ఈటీఎఫ్ ఎఫ్‌వోఎఫ్ ద్వారా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు.రెట్టింపు కాంపౌండింగ్ వాటాదారులకు సంపదను సమకూర్చడంలో యూఎస్, భారత ఈక్విటీ మార్కెట్లు గత కొన్ని దశాబ్దలుగా ఎంతో మెరుగైన పనితీరు చూపిస్తున్నాయి. ఈ రెండు మార్కెట్లను భిన్నమైన వృద్ధి చోదకాలు నడిపిస్తుంటాయి. అయినా కొన్ని ఏకరూప అంశాలు కూడా ఉన్నాయి. రెండు దేశాల్లోనూ గణనీయ సంఖ్యలో వినియోగదారులున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలు. మార్కెట్ ఆధారిత ఆరి్థక వ్యవస్థలు. అందుకే మిగిలిన మార్కెట్లకు భిన్నంగా అమెరికా, భారత్ దీర్ఘకాలంగా ఇన్వెస్టర్లకు మెరుగైన రాబడులు అందిస్తున్నాయి. ఈ రెండు దేశాల స్టాక్స్‌లోనూ పెట్టుబడులు సంపద సృష్టికి రెండు ఇంజన్ల మాదిరిగా పనిచేస్తాయి. వర్ధమాన మార్కెట్లలో అత్యధిక వృద్ధి అవకాశాలు భారత ఈక్విటీల ద్వారా.. టెక్నాలజీ, హెల్త్‌కేర్, కన్జ్యూమర్ గూడ్స్ పరంగా దిగ్గజ కంపెనీల్లో ఎక్స్పోజర్ అమెరికన్ ఈక్విటీల ద్వారా సొంతం చేసుకోవచ్చు. ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ఎన్ఎస్ఈ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ)ని ప్రారంభించింది. ఇక్కడ ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా ప్రారంభించడం ద్వారా యూఎస్‌కు చెందిన 50 స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ రిజిస్టర్డ్ స్టాక్ బ్రోకర్ ద్వారా ఖాతా తెరిచి, బ్యాంక్ ఖాతా నుంచి ఫండ్స్ బదిలీ చేసుకుని షేర్లు కొనుగోలు చేసుకోవచ్చు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం ఒక ఆరి్థక సంవత్సరంలో ఒకరు గరిష్టంగా 2,50,000 డాలర్లను విదేశాల్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు అనుమతి ఉంది స్థిరత్వం.. రాబడులు ఆరి్థక మందగమన సమయాల్లో అమెరికా, భారత మార్కెట్లు ఒకే మాదిరి పనితీరు చూపించాలని లేదు. గడిచిన 20 ఏళ్లలో యూఎస్, భారత ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టినట్టయితే భారీ మార్కెట్ పతనాల్లో నష్టాలు తగ్గినట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. చాలా అరుదుగానే ఈ రెండు ఒకే మాదిరి ప్రవర్తిస్తాయి. అంతర్జాతీయ సంక్షోభాల్లో రూపాయితో డాలర్ బలపడుతుంటుంది. దీంతో ఆ సమయంలో యూఎస్ పెట్టుబడులు అదనపు విలువను సమకూరుస్తాయి. ఇదే నష్టాలను తగ్గించి, పెట్టుబడులకు స్థిరత్వాన్ని ఇస్తుంది. అమెరికా స్టాక్స్, భారత స్టాక్స్‌కు 50:50 రేషియోలో పెట్టుబడులు కేటాయించుకోవడం వల్ల రిస్క్ ఆధారిత మెరుగైన రాబడులకు అవకాశం ఉంటుందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రిస్‌్కను పరిమితం చేసుకుని, వీలైనంత అధిక రాబడులు సమకూర్చుకోవడమే విజయవంతమైన పెట్టుబడి విధానం రహస్యం. భారత ఇన్వెస్టర్లకు విదేశీ స్టాక్స్ అన్నవి సమతూకాన్నిస్తాయి. ఒకటి అభివృద్ధి చెందిన దేశం అయితే, రెండేది 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించే లక్ష్యంతో పనిచేస్తున్న దేశం. రెండింటిలోనూ వృద్ధి అవకాశాలను సొంతం చేసుకోవడం ఇన్వెస్టర్ల ముందున్న మెరుగైన మార్గాల్లో ఒకటి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
డైవర్సిఫికేషన్ ప్రయోజనాలకు 3–4 ఫండ్స్ చాలు
నేను సీనియర్ సిటిజన్‌ను. మంచి డివిడెండ్ల కోసం పెద్ద మొత్తంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి. – ఆనంద రావు, వరంగల్ మ్యూచువల్ ఫండ్ రాబడులు డివిడెండ్ల రూపంలోనే పొందాలనే భావన నుంచి బయటకు రండి. సీనియర్ సిటిజన్ల విషయంలో పన్ను ప్రయోజనాలు అత్యంత కీలకమైన అంశం. మ్యూచువల్ ఫండ్స్ రాబడుల విషయమై ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రధానమైన మార్పులు జరిగాయి. ఈక్విటీ ఫండ్స్‌పై వచ్చే డివిడెండ్లు, మూలధన లాభాలపై 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ మీకు రూ.10 డివిడెండ్ ఇచ్చిందనుకోండి. పన్ను భారం పోను మీకు నికరంగా వచ్చే డివిడెండ్ రూ.9 మాత్రమే. దీనికంటే, సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్(ఎస్‌డబ్ల్యూపీ) అనుసరించడం ఉత్తమం. మరొక్క విషయం మీరు ఎప్పుడూ ఒకేసారి పెద్ద మొత్తంలో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయకూడదు. మార్కెట్ గరిష్ట స్థాయిల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే మీకు నష్టభయం అధికంగా ఉంటుంది. మీ దగ్గరున్న మొత్తాన్ని కనీసం 12–24 భాగాలుగా చేసి నెలకు ఒక భాగం చొప్పున ఇన్వెస్ట్ చేయాలి. మీకు పెన్షన్ వస్తున్నట్లయితే, మీకు మ్యూచువల్ ఫండ్స్ నుంచి తక్కువ నెలవారీ ఆదాయం వస్తే సరిపోతుంది. మీకు ఎలాంటి పెన్షన్ ఆదాయం లేనప్పుడు... మ్యూచువల్ ఫండ్స్ నుంచి పెద్ద మొత్తమే మీకు నెలవారీ ఆదాయంగా అవసరమవుతుంది. మీరు ఇన్వెస్ట్ చేస్తున్న మొత్తంలో ఏడాదికి 5 శాతం చొప్పున విత్‌డ్రాయల్ చేసుకునేలా మీ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఉండాలి. నేను గత కొంత కాలంగా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నాను. నా పోర్ట్‌ఫోలియోలో 4–5 ఫండ్స్ మాత్రమే ఉన్నాయి. డైవర్సిఫికేషన్ ప్రయోజనాన్ని మరింతగా పెంచుకోవడానికి ఫండ్స్ సంఖ్యను మరింతగా పెంచుకోవాలా ? – ప్రగతి, విశాఖపట్టణం మ్యూచువల్ ఫండ్స్‌కు సంబంధించి డైవర్సిఫికేషన్ అత్యంత ముఖ్యమైన విషయం. నష్టభయాన్ని తగ్గించడంలో డైవర్సిఫికేషన్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. డైవర్సిఫికేషన్ ప్రయోజనాల కోసమే అసలు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఒక స్థాయికి మించిన తర్వాత డైవర్సిఫికేషన్‌తో ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పవచ్చు. మరీ మితి మీరితే అది డై–వరస్ట్(అధ్వాన)–ఫికేషన్ అవుతుంది. డైవర్సిఫికేషన్ మితిమీరితే మీ పోర్ట్‌ఫోలియో పనితీరు పేలవంగా ఉండే అవకాశాలూ ఉండొచ్చు. మీ పోర్ట్‌ఫోలియోలో ఇప్పుటికే ఐదు మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందడానికి ఈ ఫండ్స్ సరిపోతాయి. మీరు ఇన్వెస్ట్ చేయబోయే కొత్త ఫండ్ పూర్తిగా ప్రత్యేకమైనదై ఉండాలి. అలా ఉంటేనే కొత్త ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయండి. మూడు మల్టీక్యాప్ ఫండ్స్, నాలుగు స్మాల్–క్యాప్ ఫండ్స్ ఉన్నా కూడా మంచి డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు పొందవచ్చు. పన్ను మదింపు పరంగా చూసినప్పుడు...మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ సరళంగా ఉండాలి. ఫండ్స్ ఎక్కువైన కొద్దీ, ఫీజులు కూడా ఎక్కువగా ఉంటాయి. మరోవైపు పన్ను మదింపు గందరగోళంగా మారే అవకాశాలూ ఉంటాయి. అందుకని మీ పోర్ట్‌ఫోలియోలో విభిన్నమైన మ్యూచువల్ ఫండ్స్ 4–5 ఉంటే చాలు. డైవర్సిఫికేషన్ ప్రయోజనాలు బాగానే పొందవచ్చు. డెట్ పోర్ట్‌ఫోలియోలో ఎండోమెంట్ ప్లాన్లు ఒక భాగంగా తప్పనిసరిగా ఉండాలా ? స్థిరాదాయాన్ని ఇచ్చే సాధానాలకు ప్రత్యామ్నాయంగా ఎండోమెంట్ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయమేనా? – గోపాల్, విజయవాడ మీరు చెల్లించే ‘ధర’ను పరిగణనలోకి తీసుకుంటే, ఎండోమెంట్ ప్లాన్‌ల్లో వచ్చే రాబడి తక్కువగా ఉంటుంది. ఈ దృష్ట్యా స్థిరాదాయ సాధనాలకు ప్రత్యామ్నాయంగా ఎండోమెంట్ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదు. అయితే మీరు ఇప్పటికే ఎండోమెంట్ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నా, మీరు ఇన్వెస్ట్ చేసిన ఎండోమెంట్ ప్లాన్లు సమీప భవిష్యత్తులో మెచ్యూర్ అవుతున్నా, మరే ప్రత్యేక కారణాల వల్ల ఈ ప్లాన్‌ల్లో ఇన్వెస్ట్ చేసి ఉన్నా,.. డెట్ పోర్ట్‌ఫోలియోలో ఒక భాగంగా ఎండోమెంట్ ప్లాన్లను పరిగణించవచ్చు. నిర్వహణ ఆస్తులు అధికంగా ఉన్న మ్యూచువల్ ఫండ్స్ రాబడులు కూడా అధికంగా ఉంటాయా ? లేక నిర్వహణ ఆస్తులు తక్కువగా ఉన్న మంచి పనితీరు ఉన్న మ్యూచువల్ ఫండ్‌కు మారిపోమంటారా? – జబ్బార్, హైదరాబాద్ మ్యూచువల్ ఫండ్స్.. ఏ కేటగిరికి చెందినవనే అంశాన్ని బట్టి దాని నిర్వహణ ఆస్తులు (ఏయూఎమ్– అసెట్స్ అండర్ మేనేజ్మెంట్) కీలకమవుతాయి. ఉదాహరణకు లిక్విడ్ ఫండ్స్, స్వల్పకాలిక డెట్ ఫండ్స్ విషయానికొస్తే, అధిక ఏయూఎమ్ ఉన్న ఫండ్స్ మంచి రాబడులను ఇచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. లార్జ్ క్యాప్ ఫండ్స్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. లార్జ్, మల్టీ క్యాప్ ఫండ్స్ ఏయూఎమ్‌లు అధికంగా ఉన్నా కూడా ఆ ఫండ్స్ పనితీరు బాగా ఉంటుంది. మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్ ఏయూఎమ్‌లు పెరుగుతున్న కొద్దీ, వాటి పనితీరు కొద్దిగా మందగించే అవకాశాలున్నాయి. మిడ్ క్యాప్ ఫండ్‌గా మొదలైన ఒక ఫండ్ ప్రస్థానం ఆ తర్వాత ఏయూఎమ్‌లు అధికంగా పెరగడంతో లార్జ్ క్యాప్‌కు ఎదిగింది. ఇలాంటి ఫండ్స్ తక్కువగానే ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ఫండ్ ఏ కేటగిరీ కిందకు వస్తుందో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోండి. ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్ -
ఎంత రిస్క్ అయినా ఓకే!
ఇటీవలనే ఎస్బీఐ ఎఫ్ఎంసీజీ ఫండ్‌లో రూ.50,000 ఇన్వెస్ట్ చేశాను. ఇది సరైన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయమేనా? - ప్రకాశ్, వరంగల్ ఏదైనా మ్యూచువల్ ఫండ్‌లో ఒకేసారి పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం సరైనది కాదు. అదీ ఎస్బీఐ ఎఫ్ఎంసీజీ వంటి ఒకే రంగానికి చెందిన ఫండ్‌లో ఇలా ఇన్వెస్ట్ చేయడం అస్సలు సరైనది కాదు. మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసేది సాధారణంగా డైవర్సిఫికేషన్ ప్రయోజనాల కోసం. ఇక మీ విషయానికొస్తే ఆర్థిక పరిస్థితులు బాగా లేనప్పటికీ, గత కొన్నేళ్లుగా ఎఫ్ఎంసీజీ రంగం మంచి పనితీరునే కనబరుస్తోంది. అయితే మార్కెట్లలో నెలకొన్న ప్రస్తుత ఆశావహ పరిస్థితులను బట్టి చూస్తే, ప్రస్తుత బుల్ రన్లో ఇతర రంగాలు దూసుకుపోయినట్లుగా ఎఫ్ఎంసీజీ రంగం దూసుకుపోకపోవచ్చు. అందుకని మీ ఇన్వెస్ట్మెంట్లను డైవర్సిఫై చేయండి. సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేయండి. నేను 2010లో సుందరం ట్యాక్స్ సేవర్‌లో రూ.80,000 ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.87,000. నా ఇన్వెస్ట్మెంట్లను కొనసాగించాలా? ఉపసంహరించుకోమంటారా? - కృష్ణ, విజయవాడ గత ఐదేళ్లు చాలా ఈక్విటీ ఫండ్స్‌కు కలసిరాలేదు. సుందరం ట్యాక్స్ సేవర్ దీనికి మినహాయింపు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితులు టర్న్ అరౌండ్ అయ్యే సూచనలున్నాయి. ప్రస్తుత బుల్న్‌ల్రో ఈ ఫండ్ మంచి పనితీరు కనబరిచే అవకాశాలున్నాయి. దీంతో మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌పై రాబడి మరింతగా మెరుగుపడవచ్చు. మార్కెట్లు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ ఫండ్ మంచి రాబడులనే ఇవ్వవచ్చు. అందుకని తొందరపడి మీ ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకోకుండా, కొనసాగించండి. నేను గత 5-6 ఏళ్లుగా ఫ్రాంక్లిన్ ఇండియా ఫ్లెక్సిక్యాప్, ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ ఫండ్స్‌ల్లో రూ.1,000 చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇలా 15 సంవత్సరాల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నా ఇన్వెస్ట్మెంట్లను ఉపసంహరించుకోమంటారా ? - ఆదిత్య రెడ్డి, కడప సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ప్రయోజనాలను మీరు పొందుతున్నారని చెప్పవచ్చు. గత ఐదేళ్లుగా మార్కెట్లు బాగా లేవు. అయినా, మీ ఇన్వెస్ట్మెంట్స్ మంచి రాబడులనే సాధించాయని చె ప్పొచ్చు. దీనికి కారణం మీరు ఒక పద్ధతి ప్రకారం మంచి ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడమే. మీరు 15 ఏళ్ల పాటు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారు. కాబట్టి, నిస్సందేహంగా ఇన్వెస్ట్మెంట్లను కొనసాగించండి. ఇప్పడే పెట్టబడులను ఉపసంహరించుకోకండి. నేను నెలకు రూ.10,000 చొప్పున ఇన్వెస్ట్ చేయగలను. ఎంతటి రిస్క్‌నైనా భరిస్తాను. నా ఇన్వెస్ట్మెంట్ కాలపరిమితి మూడేళ్లు. కొన్ని మంచి ఫండ్స్ సూచించండి? - మాళవిక, హైదరాబాద్ దూకుడుగా ఉండే ఇన్వెస్టర్లు మంచి రాబడుల కోసం ఎంతటి రిస్క్‌నైనా భరిస్తారు. మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌తో ఒక చక్కటి పోర్ట్‌ఫోలియోను నిర్మించుకుంటారు. మూడేళ్ల కాలవ్యవధి దృష్ట్యా ఇది అత్యంత రిస్క్‌తో కూడుకున్న వ్యూహమని చెప్పవచ్చు. కొంచెం అటూ, ఇటూ అయితే మీ ఇన్వెస్ట్మెంట్స్ సగానికి సగం తగ్గిపోవచ్చు. ఈ విషయాన్ని తట్టుకోగలిగితే మిడ్, స్మాల్ క్యాప్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పరిశీలించదగ్గ ఫండ్స్- యాక్సిస్ మిడ్‌క్యాప్, బీఎన్పీ పారిబస్ మిడ్‌క్యాప్, మిరా అసెట్ ఎమర్జింగ్ బ్లూ చిప్, ఫ్రాంక్లిన్ ఇండియా స్మాలర్ కంపెనీస్. మీ ఇన్వెస్ట్మెంట్ కాల వ్యవధికి ఇవి ఉత్తమమైన ఫండ్స్ అని చెప్పవచ్చు. అయితే మార్కెట్లు బాగా లేకపోతే భారీ నష్టాలు రావచ్చని మరువకండి. నేను ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూచిప్ ఫండ్‌లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఇటీవల ఈ ఫండ్ ర్యాంకింగ్ బాగా పడిపోయింది. ఈ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడం ఆపేసి, ఇంతవరకూ ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని ఉపసంహరించుకోమంటారా? అలా చేసినట్లయితే ఇలా ఉపసంహరించుకున్న సొమ్ములను దేంట్లో ఇన్వెస్ట్ చేయమంటారు? - మహ్మద్ ఇంతియాజ్, తిరుపతి ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ అనేది మంచి లార్జ్ క్యాప్ ఫండ్స్‌లో ఒకటి. గత 20-25 ఏళ్లుగా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఫండ్. ఇటీవల ఈ ఫండ్ ర్యాంకింగ్ తగ్గినప్పటికీ, ఫండ్‌పై మంచి అంచనాలే ఉన్నాయి. అందుకని ఈ ఫండ్ పట్ల నిరాశ పడాల్సిన పనిలేదని చెప్పవచ్చు. ఈ ఫండ్ లార్జ్ క్యాప్ స్టాక్స్‌ల్లోనే ఇన్వెస్ట్ చేస్తోంది. అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. ఈ దృష్ట్యా, మీరు ఫ్రాంక్లిన్ ఇండియా బ్లూ చిప్ ఫండ్ నుంచి మీ ఇన్వెస్ట్మెంట్స్ ఉపసంహరించి ఫ్రాంక్లిన్ ఇండియా ప్రైమా ప్లస్ లేదా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డైనమిక్ లేదా క్వాంటమ్ లాంగ్‌టర్మ్ ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఈ ఫండ్స్ ట్రాక్ రికార్డ్‌లు బావున్నాయి.


