ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లకు చిరపరిచితమైన పేరు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki). 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad)పుస్తకంతో ఆర్థిక పాఠాలు నేర్పిన ఆయన, తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2026-27 మధ్య కాలంలో ప్రపంచం ఒక భారీ ఆర్థిక సంక్షోభాన్ని, బహుశా ఒక గొప్ప ఆర్థిక మాంద్యాన్ని (Great Depression) ఎదుర్కోబోతోందని ఆయన హెచ్చరించారు.
సంక్షోభంలో చిక్కుకుంటారా.. లాభపడతారా?
తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కియోసాకి స్పందిస్తూ.. రాబోయే ఈ భారీ క్రాష్‌లో ప్రజలు రెండు రకాలుగా మిగిలిపోతారని పేర్కొన్నారు. ఒక వర్గం వారు ఆర్థికంగా చితికిపోతే, మరో వర్గం వారు అదృష్టవంతులుగా మారి భారీగా లాభపడతారని ఆయన విశ్లేషించారు.
సంక్షోభాల్లోనే ధనవంతుడినయ్యాను..
గతంలో జరిగిన ఆర్థిక పతనాలను గుర్తు చేసుకుంటూ.. "1987, 2000, 2008, 2015, 2019, 2022 సంవత్సరాల్లో వచ్చిన సంక్షోభాల్లో నేను పేదవాడిని కాలేదు, ఇంకా ధనవంతుడిని అయ్యాను. రాబోయే 2026-27 క్రాష్‌లో కూడా నేను మరింత సంపదను పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నాను" అని కియోసాకి ధీమా వ్యక్తం చేశారు.
ఆస్తులు చౌకగా దొరికే సమయం ఇదే!
ఆర్థిక మాంద్యం సమయంలో సామాన్యులు భయపడి ఆస్తులు అమ్ముకుంటే, తెలివైన వారు పెట్టుబడులు పెడతారని కియోసాకి సూచించారు. "మార్కెట్ పతనం (Crash) అయినప్పుడు, గొప్ప ఆస్తులన్నీ తక్కువ ధరకే 'సేల్'లో లభిస్తాయి. ఆ సమయంలో వాటిని కొనుగోలు చేయడం ద్వారానే ధనవంతులు కావచ్చు" అని ఆయన వివరించారు. ఈ అవకాశాన్ని వాడుకొని అందరూ ఆర్థికంగా ఎదగాలని, ఎవరూ నష్టపోకూడదని ఆయన ఆకాంక్షించారు.
అయితే కియోసాకి అంచనాలు భారతీయ ఇన్వెస్టర్లకు ఒక హెచ్చరిక వంటివి. ఒకవైపు ప్రపంచ మార్కెట్ల ప్రభావం భారతదేశంపై పడే అవకాశం ఉండగా, మరోవైపు బంగారం (Gold), వెండి (Silver) లేదా రియల్ ఎస్టేట్ (Real Estate) వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టే వారికి ఇది గొప్ప అవకాశంగా మారవచ్చు. కానీ, తగిన ఆర్థిక ప్రణాళిక లేకుండా మార్కెట్లోకి వెళ్లడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్‌లోకి దూసుకొస్తున్న ‘జెన్-జీ’
IN THIS COMING CRASh possibly a Grest Drpression…. Will you be “FU’CD UP or LU’CD UP.”
So far….in the crashes of 1987, 2000, 2008, 2015, 2019, 2022 I got richer not poorer.
And again in coming giant crash of 2026-27….I plan on growing richer not poorer.
I wish the same for…— Robert Kiyosaki (@theRealKiyosaki) April 28, 2026


