ప్రపంచ ఆర్థిక మాంద్యంపై కియోసాకి ‍వ్యాఖ్యలు | Rich Dad Poor Dad’ author Robert Kiyosaki has sounded the alarm on a global monetary collapse | Sakshi
Sakshi News home page

ప్రపంచ ఆర్థిక మాంద్యంపై కియోసాకి ‍వ్యాఖ్యలు

Jun 24 2025 5:27 PM | Updated on Jun 24 2025 7:13 PM

rich dad roor dad author Robert Kiyosaki sounded the alarm on global monetary collapse

ప్రసిద్ధ పుస్తకం ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత రాబర్ట్ కియోసాకి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ త్వరలో కుప్పకూలుతుందని చెబుతూ.. పెట్టుబడిదారులు ఏం చేయాలో సూచించారు. అధిక రుణ భారం కారణంగా ప్రభుత్వ ఫియట్ కరెన్సీ(కరెన్సీ నోటుకు ప్రభుత్వం ఆపాదించే విలువ)లపై ఆధారపడిన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని పేర్కొన్నారు. కాబట్టి బిట్‌కాయిన్‌(బీటీసీ)ను కొనుగోలు చేయాలని చెప్పారు.

ఇదీ చదవండి: ఏటా రూ.10.8 లక్షలు జీతం.. రూ.3.2 లక్షలు పొదుపు అయినా..

ముందస్తు హెచ్చరిక

రాబర్ట్ కియోసాకి చాలాకాలంగా ఫియట్ ద్రవ్య వ్యవస్థ, ప్రభుత్వ ఆర్థిక విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. నియంత్రణలేని ద్రవ్య ముద్రణ కారణంగా అమెరికా డాలర్ వంటి కరెన్సీలు విలువను కోల్పోతాయని అభిప్రాయపడుతున్నారు. బంగారం, వెండి, బిట్ కాయిన్ (బీటీసీ) వంటి వాటిలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు. అందుకు ఇదే సరైన సమయమని చెబుతున్నారు. ఫియట్ కరెన్సీలు పతనమవుతున్న కొద్దీ వీటి విలువ పెరుగుతుందని కియోసాకి పేర్కొన్నారు. డబ్బును పొదుపు లేదా బాండ్లలో మాత్రమే ఉంచవద్దని కియోసాకి సలహా ఇచ్చారు. ఈ సంప్రదాయ మార్గాలపై ఆధారపడే వారు భారీ నష్టాలను చూడాల్సి వస్తుందని అభిప్రాయపడ్డారు.
 

Advertisement
 
Advertisement
Advertisement