
ఐటీయేతర, ఏఐ–ఎంఎల్ ఉద్యోగాలకు డిమాండ్
హైదరాబాద్‌లో నియామకాల జోరు
నౌకరీ జాబ్‌స్పీక్ నివేదిక
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టులో దేశీయంగా వైట్–కాలర్ జాబ్ మార్కెట్ వార్షిక ప్రాతిపదికన 3 శాతం వృద్ధి చెందింది. ప్రదానంగా ఐటీయేతర రంగాలు, కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) ఉద్యోగాలకు డిమాండ్ నెలకొన్నట్లు నౌకరీ జాబ్‌స్పీక్ నివేదిక వెల్లడించింది. ప్రొఫెషనల్స్, మేనేజర్లు, అడ్మిని్రస్టేషన్ ఉద్యోగాలను వైట్ కాలర్ ఉద్యోగాలుగా వ్యవహరిస్తారు.
నివేదిక ప్రకారం ఆగస్టులో అత్యధికంగా 24 శాతం హైరింగ్‌తో బీమా రంగం అగ్రస్థానంలో నిలి్చంది. ఆతిథ్య (22 శాతం), రియల్ ఎస్టేట్ (18 శాతం) రంగాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. బీపీవో/ఐటీఈఎస్ (17 శాతం), విద్య (16 శాతం), ఆయిల్..గ్యాస్ (7 శాతం), రిటైల్ (3 శాతం), ఎఫ్‌ఎంసీజీ (2 శాతం) రంగాల్లో కూడా సానుకూల హైరింగ్ నమోదైంది. రిపోర్టులో మరిన్ని విశేషాలు..
→ కొత్త టెక్నాలజీల్లో నిపుణులకు డిమాండ్ నెలకొనడంతో ఏఐ/ఎంఎల్ ఉద్యోగాలకు హైరింగ్ 54 శాతం ఎగిసింది. అయితే, ఓవరాల్‌గా ఐటీ/సాఫ్ట్‌వేర్ సరీ్వసుల రంగంలో నియామకాలు 6 శాతం తగ్గాయి.
→ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సరీ్వసుల విభాగంలో హైరింగ్ 11 శాతం, టెలికం/ఐఎస్‌పీలో నియామకాలు 13 శాతం క్షీణించాయి.
→ ఫ్రెషర్ల (0–3 ఏళ్ల అనుభవం) రిక్రూట్‌మెంట్ 7 శాతం పెరిగింది. ఆతిథ్య, రియల్ ఎస్టేట్, విద్య తదితర ఐటీయేతర రంగాల్లో డిమాండ్ ఇందుకు తోడ్పడింది.
→ ఓవరాల్‌గా 10 శాతం హైరింగ్ వృద్ధితో నియామకాలకు సంబంధించి హైదరాబాద్ టాప్ మెట్రో సిటీగా నిలి్చంది. యూనికార్న్‌లలో (1 బిలియన్ డాలర్ల విలువ చేసే అంకురాలు) రిక్రూట్‌మెంట్ 45 శాతం ఎగిసింది.