ఈసారి ‘జెడి’ ట్రంప్‌! | White House Shares AI Image Of Trump As Muscular Jedi On Star Wars Day | Sakshi
Sakshi News home page

ఈసారి ‘జెడి’ ట్రంప్‌!

May 6 2025 6:01 AM | Updated on May 6 2025 6:01 AM

White House Shares AI Image Of Trump As Muscular Jedi On Star Wars Day

వాషింగ్టన్‌: ‘స్టార్‌వార్స్‌ డే’ సందర్భంగా కృత్రిమ మేధతో రూపొందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరో ఫొటోను అధ్యక్ష భవనం ఆదివారం విడుదల చేసింది. ఈసారి, హాలీవుడ్‌ సినిమా ‘స్టార్‌ వార్స్‌ యూనివర్స్‌’లోని కండలు తిరిగిన ‘జెడి’ అవతారంలో ట్రంప్‌ దర్శనమిచ్చారు. రెండు రోజుల క్రితమే దివంగత పోప్‌ ఫ్రాన్సిస్‌ ఫొటోతో కనిపించిన ట్రంప్‌పై ఆన్‌లైన్‌లో తీవ్ర విమర్శలు వ్యక్తమవడం తెల్సిందే.

 తాజాగా, జెడి ఫొటోను సైతం జనం వదల్లేదు. చౌకబారు రాజకీయ ప్రచారంగా ఎత్తిపొడిచారు. ఆ సినిమాలో శత్రువుల దగ్గర మాత్రమే ఉండే ఎర్ర లైట్‌ సాబెర్‌ను ట్రంప్‌ పట్టుకోవడాన్ని తప్పుబట్టారు. గద్దలు, అమెరికా జెండాలు వెనుక కనిపిస్తుండగా జెడి వేషధారణతో కండలు తిరిగిన దేహంతో ట్రంప్‌ కనిస్తున్న ఫొటోను వైట్‌హౌస్‌ సోషల్‌ మీడియా వేదికపై షేర్‌ చేసింది. 

Advertisement
 
Advertisement
Advertisement