breaking news
Jedi
-
ఈసారి ‘జెడి’ ట్రంప్!
వాషింగ్టన్: ‘స్టార్‌వార్స్ డే’ సందర్భంగా కృత్రిమ మేధతో రూపొందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో ఫొటోను అధ్యక్ష భవనం ఆదివారం విడుదల చేసింది. ఈసారి, హాలీవుడ్ సినిమా ‘స్టార్ వార్స్ యూనివర్స్’లోని కండలు తిరిగిన ‘జెడి’ అవతారంలో ట్రంప్ దర్శనమిచ్చారు. రెండు రోజుల క్రితమే దివంగత పోప్ ఫ్రాన్సిస్ ఫొటోతో కనిపించిన ట్రంప్‌పై ఆన్లైన్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవడం తెల్సిందే. తాజాగా, జెడి ఫొటోను సైతం జనం వదల్లేదు. చౌకబారు రాజకీయ ప్రచారంగా ఎత్తిపొడిచారు. ఆ సినిమాలో శత్రువుల దగ్గర మాత్రమే ఉండే ఎర్ర లైట్ సాబెర్‌ను ట్రంప్ పట్టుకోవడాన్ని తప్పుబట్టారు. గద్దలు, అమెరికా జెండాలు వెనుక కనిపిస్తుండగా జెడి వేషధారణతో కండలు తిరిగిన దేహంతో ట్రంప్ కనిస్తున్న ఫొటోను వైట్‌హౌస్ సోషల్ మీడియా వేదికపై షేర్ చేసింది. -
వృక్ష పద్ధతిలో మల్బరీ సాగు
ఈ ఏడాది 3,100 ఎకరాల విస్తరణ లక్ష్యం పట్టు పరిశ్రమశాఖ జేడీ సి.అరుణకుమారి అనంతపురం అగ్రికల్చర్: వృక్ష పద్ధతి (ట్రీప్లాంటేషన్)లో మల్బరీ సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తామని పట్టు పరిశ్రమశాఖ జాయింట్ డైరెక్టర్ సి.అరుణకుమారి ‘సాక్షికి తెలిపారు. ఈ ఏడాది 3,100 ఎకరాల్లో కొత్తగా మల్బరీ విస్తీర్ణం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వర్షాలు ప్రారంభం కావడం, గరిష్ట ధరలు స్థిరంగా కొనసాగుతుండటంతో రేషం పెంపకానికి రైతులు మొగ్గు చూపిస్తున్నారని ఆమె తెలిపారు. ట్రీప్లాంటేషన్ పద్ధతి వల్ల బెట్ట పరిస్థితులు ఏర్పడినా సమస్య ఉండదన్నారు. ట్రీప్లాంటేషన్కు ఎకరాకు సబ్సిడీ రూపంలో రైతులకు 22,500 అందజేస్తామన్నారు. రైతులకు ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుండటంతో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయాలని ప్రతిపాదించామన్నారు. క్రాస్‌బ్రీడ్ (సీబీ) రకాన్ని తగ్గించి బైవోల్టీన్ రకానికి ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది 44 లక్షల బైవోల్టీన్ గుడ్లు ఉత్పత్తి చేసి రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఉపాధిహామీ కింద 250 షెడ్లు మంజూరయ్యాయన్నారు. గతంలో మాదిరిగా అన్ని రకాల పథకాలు రాయితీతో అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మల్బరీకి మించిన లాభదాయకమైన పంట మరొకటి లేనందున రైతులు వినియోగించుకోవాలని ఆమె సూచించారు.