YASHODA AI జై.. యశోద ఏఐ | National Commission for Women Launches YASHODA AI to Empower Women | Sakshi
Sakshi News home page

YASHODA AI జై.. యశోద ఏఐ

May 23 2025 6:08 AM | Updated on May 23 2025 9:39 AM

National Commission for Women Launches YASHODA AI to Empower Women

ఉమన్‌ ఎంపవర్‌మెంట్‌

అంతంత మాత్రమే చదువుకున్న మహిళలను టెక్‌–సావీలుగా తీర్చిదిద్దవచ్చా? ‘అవును’ అని చెప్పడానికి దేశవ్యాప్తంగా ఎంతోమంది మహిళల విజయాలే సాక్ష్యం.
తాజాగా... దేశవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలను టెక్‌–సావీలుగా తీర్చిదిద్దడానికి నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఉమెన్‌(ఎన్‌సీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ‘యశోద ఏఐ క్యాంపెయిన్‌’ మొదలైంది...

నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ వుమెన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) ఆధ్వర్యంలో ప్రత్యేకమైన క్యాంపెయిన్‌ ప్రారంభమైంది. ఈ క్యాంపెయిన్‌ ద్వారా లక్షలాది మహిళలకు డిజిటల్‌ లిటరసీప్రాముఖ్యత గురించి తెలియజేస్తారు. సైబర్‌ నేరాల బారిన పడకుండా మహిళలకు అవసరమైన శిక్షణ ఇస్తారు. రాబోయే రోజుల్లో మహిళలను టెక్‌–సావీగా మార్చడానికి రకరకాల కార్యక్రమాలకు రూపకల్పన చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్‌ బరేలీలోని మహాత్మా జ్యోతిబా ఫులే యూనివర్శిటీలోప్రారంభమయ్యే ‘యశోద ఏఐ క్యాంపెయిన్‌’ (యువర్‌ ఏఐ సాక్షి ఫర్‌ షేపింగ్‌ హరైజన్స్‌ విత్‌ డిజిటల్‌ అవేర్‌నెస్‌) ద్వారా రాబోయే నెలల్లో దేశవ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), సైబర్‌ సెక్యూరిటీ, డిజిటల్‌ లిటరసీలో శిక్షణ ఇస్తారు.

ఇదీ చదవండి: నా బరువుతో నేను హ్యాపీగానే ఉన్నా : ఐశ్వర్య ఘాటు రిప్లై వైరల్‌

‘యశోద ఏఐ’ లక్ష్యం దేశంలోని ప్రతి మూలలో మహిళలకు సాంకేతిక విషయాల్లోప్రావీణ్యం కల్పించడం. తొలిదశలో రెండు లక్షల కంటే ఎక్కువమంది మహిళలకు సాంకేతిక విషయాల్లో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్కూల్, కాలేజి, స్వయంసహాయక బృందాలు, ఆశా వర్కర్స్, టీచర్స్, ప్రభుత్వ ఉద్యోగులు... ఇలా వివిధ వర్గాల మహిళలకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ)లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో పాల్గొనేవారికి స్థానిక భాషల్లో కోర్సు మెటీరియల్‌ అందిస్తారు. వర్క్‌షాప్‌లు నిర్వహించి డిజిటల్‌ టూల్స్‌ వాడకంపై అవగాహన కలిగిస్తారు.

చదవండి: వారానికి 52 గంటలకు మించి పని చేస్తే.. మెదడు మటాషే!
 

చేంజ్‌ మేకర్స్‌
గ్రామీణ, పట్టణప్రాంతం అని తేడా లేకుండా అంతంత మాత్రం చదువుకున్న అమ్మాయిలు కూడా సాంకేతిక విషయాల్లో ప్రావీణ్యం సాధించేలా చేయవచ్చని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. వాటిలో కొన్ని...

ఒడిషాలోని రఘురాజ్‌పూర్‌ గ్రామానికి చెందిన పద్దెనిమిది సంవత్సరాల చంద్రమాకు నెలకు వెయ్యి రూపాయల ఆదాయం అనేది కష్టంగా ఉండేది. తన మాతృభాషలో మాట్లాడిన మాటలను సెల్‌ఫోన్‌లో రికార్డ్‌ చేయడం ద్వారా ఇప్పుడు నెలకు అయిదువేలు సంపాదిస్తోంది. బెంగళూరుకు చెందిన స్వచ్ఛంద సంస్థ ‘కార్య’ కోసం పనిచేస్తోంది చంద్రమా. స్థానికభాషల్లో డేటాసెట్స్‌ను రూపొందించడంపై ‘కార్య’ దృష్టి పెట్టింది.

కోల్‌కత్తాలోని గ్రామీణప్రాంతానికి చెందిన మౌమితా షా దాస్‌ రోజూ ఉదయాన్నే తన ఫోన్‌లో డిజిటైజింగ్‌ వర్క్‌ మొదలుపెడుతుంది. స్కూలుకు వెళ్లి వచ్చిన తరువాత మళ్లీ డిజిటైజింగ్‌ వర్క్‌లోకి వెళుతుంది. ‘తక్కువ టైమ్‌ పని చేసినా మంచి ఆదాయం సంపాదిస్తున్నాను. ఈ డిజిటల్‌ టాస్క్‌ల ద్వారా నేను ఏ పని అయినా చేయగలను అనే నమ్మకం వచ్చింది’ అంటుంది మౌమిత.

స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు...
ఏఐ మోడల్స్‌ని ట్రైన్‌ చేయడంపై ఫోకస్‌ చేసే జాబ్స్‌లో హైరింగ్‌ పెరగడంతో గ్రామీణప్రాంతాలకు చెందిన చంద్రమా, మౌమితలాంటి ఎంతోమంది అమ్మాయిలకు ఉపాధి లభిస్తోంది. వారు చేసే పనికి సాంకేతిక విద్యలో పట్టా అవసరం లేదు. స్మార్ట్‌ఫోన్, డిజిటల్‌ స్కిల్స్‌ ఉంటే సరిపోతుంది.

‘గ్రామీణప్రాంతాలలోని మహిళలు సబ్జెక్ట్‌ మ్యాటర్‌ ఎక్స్‌పర్ట్‌గా మారేలా శిక్షణ ఇస్తాం. మన దేశానికి సంబంధించిప్రాంతీయ భాషలలో ఏఐ మోడల్స్‌ అభివృద్ధిపై దృష్టి పెట్టాం’ అంటున్నారు ‘కార్య’ సీయివో మనూ చోప్రా ఒకప్పుడు కన్‌స్ట్రక్షన్‌ వర్కర్‌గా పనిచేసిన రాజస్థాన్‌కు చెందిన రోమల దీదీ ఇలా అంటోంది. ‘కార్య ద్వారా నాకు వచ్చే డబ్బుతో పిల్లల బడిఫీజులు చెల్లిస్తున్నాను. ఇతర ఖర్చులకు కూడా ఈ డబ్బు ఉపయోగపడుతోంది’.

ఐ–సాక్ష్యమ్‌
బిహార్‌కు చెందిన ‘ఐ–సాక్ష్యమ్‌’ సంస్థ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగించి రూపొందించిన ఫెలోషిప్‌  ప్రోగ్రామ్స్‌ ద్వారా ఎంతో మంది యువతులను చేంజ్‌మేకర్స్‌గా మారుస్తోంది. నిజానికి వీరిలో చాలామందికి స్మార్ట్‌ఫోన్‌ గురించి తెలియదు. అలాంటి వారిని కూడా సాంకేతిక అంశాలలో పట్టు సాధించేలా, ఉపాధి పొందేలా చేస్తున్నారు. సాంకేతిక విషయాల్లో పురుషులతో సమానంగా మహిళలు ముందుండే లక్ష్యంతో ఐ–సాక్ష్యమ్‌ కృషి చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement