ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్‌ పుస్తకాలు | Engineering books in regional languages | Sakshi
Sakshi News home page

ప్రాంతీయ భాషల్లో ఇంజినీరింగ్‌ పుస్తకాలు

Published Fri, Apr 18 2025 3:51 AM | Last Updated on Fri, Apr 18 2025 3:50 AM

Engineering books in regional languages

12 భారతీయ భాషల్లో ఇంజినీరింగ్‌ పాఠ్య పుస్తకాలు

2026 డిసెంబర్‌ నాటికి రూపకల్పన 

ఏఐసీటీఈ ప్రణాళిక 

కృత్రిమ మేధ సాయంతో 10 నిమిషాల్లో ఒక పుస్తకం తర్జుమా 

స్థానిక భాషల్లో సాంకేతిక విద్య ప్రోత్సాహానికి కసరత్తు 

దేశంలో ప్రాంతీయ భాషల్లోనూ ఇంజినీరింగ్‌ విద్యను అందించడానికి అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) చర్యలు చేపడుతోంది. స్థానిక భాషల్లో ఇంజినీరింగ్‌  పాఠ్య పుస్తకాలను అందించడానికి కసరత్తు చేస్తోంది. తద్వారా ప్రాథమిక, హైసూ్కల్‌ విద్యను మాతృభాషలో చదువుకుని ఇంజినీరింగ్‌లో ఆంగ్లమాధ్యమంతో ఇబ్బందులు పడుతున్న వారు స్థానిక భాషలోనే చదువుకుని అర్థం చేసుకునేందుకు వీలుకల్పిపస్తోంది. 

2026 డిసెంబర్‌ నాటికి 12 భారతీయ భాషల్లో పూర్తి స్థాయిలో ఇంజినీరింగ్‌ డిప్లొమా, డిగ్రీ కోర్సుల్లో పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టనుంది. హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో బోధనకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించిన పుస్తకాల రూపకల్పనలో నిమగ్నమయింది.    – సాక్షి, అమరావతి

స్థానిక భాషలో పెరుగుతోన్న ఆదరణ  
సాంకేతిక విద్యా వ్యవస్థలో భాషా అవరోధాన్ని నివారించడానికి ఏఐసీటీఈ గతంలోనే ప్రాంతీయ భాషలో ఇంజినీరింగ్‌ విద్యను ప్రవేశపెట్టింది. దేశ వ్యాప్తంగా 18 ఇంజినీరింగ్‌ కళాశాలల్లో బీటెక్‌ ప్రోగ్రామ్‌ కోసం 11 ప్రాంతీయ భాషల్లో 1140 సీట్లను ఏఐసీటీఈ ఆమోదించింది. తొలి ఏడాది 2021–22లో కేవలం 233 సీట్లు మాత్రమే భర్తీ అవ్వగా 80 శాతం మేర ఖాళీగా ఉండిపోయాయి. ఆ తర్వాత ఏడాది 2022–23లో 683 సీట్లు, 2023–24లో 928 సీట్లలో విద్యార్థులు చేరారు.    

కృత్రిమ మేధ సాయంతో 10 నిమిషాల్లో తర్జుమా 
ఇంజినీరింగ్‌లో సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ వంటి కోర్సుల్లో ప్రాంతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలను ఏఐసీటీఈ రూపొందిస్తోంది.ఈ పుస్తకాలను స్థానిక భాషల్లో వేగంగా తర్జుమా చేసేందుకు కృత్రిమమేధ సాయాన్ని తీసుకుంటోంది. దాదాపు 80 శాతం కచ్చితత్వంతో 10 నిమిషాల్లో పుస్తకాన్ని తర్జుమా చేస్తోంది. మిగిలిన 20 శాతం తప్పొప్పులను నిపుణులు సరిదిద్దుతున్నారు. 

వాస్తవానికి రాజ్యాంగం 22 ప్రాంతీయ భాషలను గుర్తించినప్పటికీ నిధుల కొరతతో తొలుత 12 స్థానిక భాషల్లో అనువదిస్తోంది. కెనడా, స్విట్జర్లాండ్‌ దేశాలు స్థానిక భాషల్లో ఉన్నత విద్యను అభ్యసించడానికి అనుమతిస్తున్నాయి. ఇదే బాటలో రష్యా, చైనా, జపాన్‌  ఉన్నాయి. ఈ క్రమంలో దేశంలోనూ మాతృభాషలో ఇంజనీరింగ్‌ పాఠ్యాంశాలను ఏఐసీటీఈ ప్రోత్సహిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement