గ్లోబల్‌ టెక్‌ దిగ్గజాల్లో రిలయన్స్‌ | Reliance only Indian company among world most valuable tech giants | Sakshi
Sakshi News home page

గ్లోబల్‌ టెక్‌ దిగ్గజాల్లో రిలయన్స్‌

Jun 3 2025 5:59 AM | Updated on Jun 3 2025 6:23 AM

Reliance only Indian company among world most valuable tech giants

30 లిస్టెడ్‌ సంస్థల జాబితాలో ఏకైక భారతీయ కంపెనీ 

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లలో ట్రేడవుతున్న 30 అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజాల్లో దేశీ సంస్థ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చోటు దక్కించుకుంది. ఆరి్టఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌–ట్రెండ్స్‌ పేరిట రూపొందించిన నివేదికలో భాగమైన లిస్టులో 23వ స్థానంలో నిల్చింది. తద్వారా భారత్‌ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక సంస్థగా నిల్చింది. 

కృత్రిమ మేధ సాంకేతికత వినియోగ ధోరణులు, ప్రభావంపై రూపొందించిన  ఈ నివేదికలో మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌పరంగా తొలి ఎనిమిది స్థానాల్లో అమెరికాకు చెందిన మైక్రోసాఫ్ట్, ఎన్‌విడియా, యాపిల్, అమెజాన్‌ తదితర సంస్థలు ఉన్నాయి. ఈ ఏడాది చైనా నుంచి 3 సంస్థలు, జర్మనీ కంపెనీలు 2, తైవాన్‌.. నెదర్లాండ్స్‌ .. దక్షిణ కొరియా.. భారత్‌ నుంచి ఒక్కో కంపెనీ చొప్పున తొలిసారిగా ఈ లిస్టులో చేరాయి.  

అమెరికా టాప్‌.. అత్యంత విలువైన 30 గ్లోబల్‌ టెక్‌ కంపెనీల జాబితాలో మూడు దశాబ్దాలుగా అమెరికా ఆధిపత్యమే కొనసాగుతోంది. ఈ లిస్టులో 1995లో అమెరికా వాటా 53 శాతంగా ఉండగా 2025లో 70 శాతానికి పెరిగింది. 30 టాప్‌ కంపెనీల్లో 21 సంస్థలు అమెరికావే ఉన్నాయి. 1995లో జపాన్‌కి 30 శాతం వాటా ఉండగా ప్రస్తుతం అది సున్నా స్థాయికి పడిపోయింది.

 

Advertisement
 
Advertisement
Advertisement