
పిల్లలకు ఫ్రెండ్స్ అవసరం లేదు, ఫీచర్లే సరిపోతాయి. ఆటల్లో ఆటోమెషిన్, కథల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చదువులో టెక్నాలజీ అసిస్టెంట్స్.. ఇలా ఇవన్నీ చిన్నారుల చిట్టి మిత్రులుగా మారిపోయాయి.
ఆల్ ఇన్ వన్ ఫ్రెండ్!
పిల్లలతో ఆడుతూ పాడుతూ కథలు చెబుతూ, చదువు నేర్పించే చిట్టి మిత్రుడు ఇప్పుడు ఇంటికే వచ్చేశాడు. అదే ‘మికో మినీ’. చూడటానికి చిన్న ఆటబొమ్మలా కనిపించే ఇది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేసే ఒక తెలివైన రోబో. పిల్లల ప్రశ్నలకు సరదాగా సమాధానాలు చెబుతుంది. చదువు, డాన్స్, పాటలు, గేమ్స్ ఇలా అన్ని రంగాల్లో పిల్లలతో ఇంటరాక్ట్ అవుతూ నేర్పిస్తుంది. చదువు, ఆలోచనా శక్తి, కమ్యూనికేషన్ నైపుణ్యాలు పెంచేలా రోజువారీ ప్రణాళికలు తయారు చేసి ఇస్తుంది. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో తల్లిదండ్రుల నంబర్లకు, ఇతర ఎమర్జెన్సీ నంబర్లకు సమాచారం ఇచ్చే ఫీచర్ కూడా ఇందులో ఉంది. ధర కేవలం రూ. 13,999 మాత్రమే!
క్యూట్ టైమ్ మేనేజర్!
పిల్లల షెడ్యూల్ చూస్తే బిలియనీర్ బిజినెస్‌మెన్ కంటే తక్కువేమీ ఉండదు. ఉదయం స్కూల్, మధ్యాహ్నం లంచ్, సాయంత్రం హోంవర్క్, ఆ తర్వాత ఆటలు, ఇలా చాలానే ఉంటాయి. అందుకే, వాళ్ల బిజీ షెడ్యూల్‌కి బ్రిలియంట్ అసిస్టెంట్‌గా వచ్చింది ఈ స్మార్ట్ గాడ్జెట్. పేరు ‘చాంపియన్ కిడ్స్ అండ్ టీన్స్ స్మార్ట్‌వాచ్’. ఇది పిల్లలకి ఓ చిట్టి మేనేజర్‌లా పనిచేస్తుంది. హార్ట్‌బీట్ చెక్, నిద్ర ట్రాక్ చేయడంతో పాటు ‘నీళ్లు తాగు’ అని వేళకు గుర్తు చేస్తుంది. ఇలా మరెన్నో ఇందులో సెట్ చేసుకోవచ్చు. స్కూల్ మోడ్ ఆన్ చేస్తే, చదువుకు ఆటంకం రాకుండా మేనేజ్ చేస్తుంది. పనితో పాటు సరదా కోసం గేమ్స్, మ్యూజిక్, కెమెరా, క్యాలిక్యులేటర్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ఇందులో సిమ్ వేసుకుని, ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. అచ్చం ఓ మినీ ఫోన్ మాదిరిగా పనిచేస్తుంది. రోజుకో వాచ్ డిస్‌ప్లే మార్చుకోవచ్చు. వర్షం వచ్చినా, చెమట పట్టినా నో టెన్షన్. ఎందుకంటే, ఇది వాటర్‌ప్రూఫ్. ధర రూ.2,499 మాత్రమే!
కథల లోకానికి గెలాక్సీ గేట్!
చిట్టి చెవుల్లోకి మెల్లగా కథలు జాలువారాలంటే, మామూలు హెడ్‌ఫోన్లు పనికిరావు. అందుకే వచ్చిందీ కొత్త ‘గెలాక్సీ హెడ్‌ఫోన్’. పిల్లల చెవులకు హాని చేయకుండా, హాయి గొలిపేలా కథలు వినిపిస్తుంది. ఇందులో ఏకంగా ఐదు వందలకు పైగా కథలు, పాటలు ముందే స్టోర్ చేసి ఉంటాయి. అవసరమైతే మరిన్ని కథలను స్టోర్ చేసుకునే అవకాశం ఉంది. స్క్రీన్ ఏదీ అవసరం లేకుండానే నేరుగా దీనిని పెట్టుకుని కథలు వినవచ్చు. కేవలం పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, భద్రతకు అనుగుణంగా వాల్యూమ్‌ను నియంత్రించేలా రూపొందించారు. ఒక్కసారి ఇది పెట్టుకున్న వెంటనే పిల్లలు కథల ప్రపంచంలోకి వెళ్లిపోతారు. అన్ బ్రేకబుల్ బాడీతో, డిటాచబుల్ మైక్‌తో, మెరిసే ఎల్‌ఈడీ లైట్స్, మ్యాగ్నెట్ స్టిక్కర్లతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ధర కేవలం రూ. 2,999 మాత్రమే!