
వినియోగదారులకు మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించడానికి చాట్‌జీపీటీ సెర్చ్‌ఫంక్షనాలిటీని అప్‌గ్రేడ్ చేసినట్లు ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘ఓపెన్ ఏఐ’ ప్రకటించింది. షాపింగ్ కోసం వినియోగదారులు ఆన్‌లైన్‌లోకి వెళ్లినప్పుడు ఈ యాడ్–ఫ్రీ సెర్చ్ రిజల్ట్ మనం కొనాలనుకునే వాటి ఫోటోలతో పాటు ధర, సమీక్షలాంటి వివరాలను అందిస్తుంది.
సెర్చ్ రిజల్ట్స్‌లో ఆప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేయగల వెబ్‌సైట్‌ల ప్రత్యక్ష లింకులు కూడా ఉంటాయి. ఈ షాపింగ్ సంబంధిత అప్‌గ్రేడ్‌లు చాట్‌జీపీటీ ప్లస్, ్ర΄ో, ఫ్రీ యూజర్‌లు... వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటాయి. యూజర్‌లకు సంబంధించి ట్రెండింగ్ సెర్చ్ టాపిక్స్‌ను కూడా చాట్‌జీపీటీ సెర్చ్ చూపిస్తుంది. వాట్సాప్ ద్వారా చాట్‌జీపీటీ సెర్చ్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.