
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రాజ్యమేలుతోంది. అన్ని రంగాల్లో ఏఐ హవా కొనసాగుతోంది. ఇప్పటికే చాలామంది ఉద్యోగుల్లో భయం పుట్టుకుంది. ఇలాంటి సమయంలో 'గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ'గా ప్రసిద్ధి చెందిన 'జియోఫ్రీ హింటన్' (Geoffrey Hinton) ఓ హెచ్చరిక జారీ చేశారు.
ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అయిన జియోఫ్రీ హింటన్ 'వన్ డెసిషన్' పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ప్రస్తుతం, AI ఇంగ్లీషులో ఆలోచిస్తుంది. కాబట్టి డెవలపర్లు కూడా టెక్నాలజీ ఏమి ఆలోచిస్తుందనే విషయాన్ని ట్రాక్ చేయడానికి వీలు కలుగుతోంది. అయితే ఇది త్వరలోనే ఓ సొంత ప్రైవేట్ భాషను అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. ఆ భాషను మానవ సృష్టికర్తలు కూడా అర్థం చేసుకోలేరని హెచ్చరించారు.
యంత్రాలు ఇప్పటికే భయంకరమైన ఆలోచనలను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని ప్రదర్శించాయి. ఆ ఆలోచనలు ఎల్లప్పుడూ మనం ట్రాక్ చేయగల భాషలోనే ఉంటాయని భావించకూడదు. ఇదే జరిగితే ఆ తరువాత జరిగే పరిణాలను అంచనా వేయలేము.
ఇదీ చదవండి: విదేశీ గడ్డపై వేల కోట్ల సామ్రాజ్యం.. ఎవరీ భారతీయుడు?
హింటన్ చేసిన కృషి AI వ్యవస్థలకు మార్గం సుగమం చేసింది. కానీ భద్రతా గురించి ఆలోచించలేదని ఒప్పుకున్నారు. అప్పట్లోనే ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయో అని గ్రహించి ఉండాల్సింది. ఇప్పుడు ఆలస్యమైంది. కాబట్టి జాగ్రత్తపడాల్సిన అవసరాన్ని గురించి ఆయన వెల్లడించారు. జ్ఞానాన్ని శ్రమతో పంచుకోవాల్సిన మానవుల మాదిరిగా కాకుండా, ఏఐ తమకు తెలిసిన వాటిని క్షణంలో కాపీ చేసి పేస్ట్ చేయగలవు. ఇదే ప్రస్తుతం చాలా రంగాలను భయపెడుతోంది. దీని గురించే హింటన్ కూడా భయపడుతున్నారు.
