
రాయ్‌పూర్: మనోడు చదివేది చత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్‌లో ఉన్న ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్‌ఫర్‌మేషన్ టెక్నాలజీలో.. మరి చేసేవి గలీజు పనులు. మనోడికి ఇంటర్నేషనల్ తెలివి తేటలు బాగా ఉన్నట్లు ఉన్నాయి. ఐటీ విద్యార్థిగా తన స్కిల్స్ డెవలప్‌చేసుకోవడం మానేసి.. అమ్మాయిల ఫోటోలను ఏఐ టెక్నాలజీ జోడించి న్యూడ్‌గా మార్చేస్తున్నాడు. ఇలా సుమారు 36 మంది విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్ చేసి వెయ్యిపైగా ఏఐ చిత్రాలను రూపొందించాడు. ఈ విషయం బయటకి రావడంతో సదరు విద్యార్థి సస్సెండ్ గురయ్యాడు.
బిలాస్‌పూర్‌కు చెందిన థర్డ్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విద్యార్థి.. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన దగ్గర్నుంచీ ఇదే పనిలో ఉన్నాడు. ఇలా 36 మంది విద్యార్థినులకు చెందిన 1000కి పైగా ఏఐ న్యూడ్ చిత్రాలను సృష్టించాడు.
ఈ విషయం బయటకు రావడంతో సదరు విద్యార్థినులు అక్టోబర్ 6వ తేదీ ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో అతన్ని సస్సండ్ చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అదే సమయంలో ముగ్గురు సభ్యులతో కూడిన స్టాఫ్ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. దీనిపై విచారణకు సిద్ధమైన ఆ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ప్రొఫెసర్ శ్రీనివాస్ తెలిపారు.
అదే సమయంలో విద్యార్థినుల రాతపూర్వక ఫిర్యాదు కోసం వేచిచూస్తున్నామని, దానిని బట్టే తమ చర్యలు ఉంటాయని రాఖీ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఆశిష్ రాజ్‌పుత్ స్పష్టం చేశారు. బాధిత విద్యార్థినుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపడతామన్నారు.