
ఆరోగ్య సమస్యలపై ఏఐ చాట్‌బాట్లలో వెదుకులాట
అదే సమాచారంతో వైద్యులతో వాదిస్తున్న రోగులు
అర్థమయ్యేలా చెప్పలేక తలలు పట్టుకుంటున్న వైద్యులు
సాక్షి, హైదరాబాద్: కృత్రిమ మేథ (ఏఐ) సాంకేతికత అన్ని రంగాల్లోకి వేగంగా విస్తరిస్తోంది. దీంతో చాలామంది తమ కు ఉన్న ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు కూడా ఏఐ ద్వారా తెలుసుకోవాలని ఉత్సాహం చూపిస్తున్నారు. వైద్యు ల సలహా మేరకు చేయించుకునే మెడికల్ టెస్టులు, ల్యాబ్ రిపోర్టులను వైద్యులకు చూపించటానికి ముందే ఏఐ చాట్‌బాట్‌ల ద్వారా విశ్లేషించుకుంటున్నారు. ఇదే ఇప్పుడు నిజ మైన వైద్యులకు తలనొప్పిగా మారిందని చెబుతున్నారు.
ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ఇంటర్నెట్‌లో శోధించి చిట్కాలు తెలుసుకునే వారి ని ‘గూగుల్ డాక్టర్లు’గా వ్యవహరిస్తుంటారు. ఇప్పుడు ఏఐ చాట్‌బాట్‌లతో గతంకంటే ఎక్కువ విషయాలే తెలుస్తుండటంతో కొందరు తమకు అంతా తెలుసు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తమ ఆన్‌లైన్ పరిజ్ఞానం బయట పెడుతూ నిజమైన వైద్యుల బుర్రలు తింటున్నారు. రోగుల మితిమీరిన సందేహాలతో వారిని సంతృప్తి పర్చలేక తమ తల ప్రాణం తోకకు వస్తోందని వైద్యులు వాపోతున్నారు.
మంచీ.. చెడు రెండూ ఉన్నాయి..
జనరేటివ్ ఏఐ, చాట్ జీపీటీలో లభించే సమా చారంతో తమ రిపోర్టుల గురించి చర్చించే కొందరు రోగుల వాదనా పటిమ ఆశ్చర్యపరుస్తోందని ఢిల్లీలోని పీఎస్‌ఆర్‌ఐ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్, ఎయిమ్స్ పల్మనాలజీ విభాగం మాజీ అధిపతి డా.జీసీ ఖిల్నానీ తెలిపారు. తమకు ఉన్న వైద్య సమస్యలపై డాక్టర్లను సంప్రదించడానికి ముందే కొందరు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న అనియంత్రిత సమాచారం ద్వారా వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.
దీనివల్ల చాలామంది ఎంతో ఆందోళనతో తన వద్దకు వచ్చారని, వారికి అర్థమయ్యేలా వివరించేందుకు చాలా సమయం పట్టి ందని పేర్కొన్నారు. ఊహించుకునే అవకాశాలు ఉన్నాయ ని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో డాక్టర్లు రోగులకు సరైన చికిత్స అందించేందుకు మొగ్గుచూపుతారని తెలిపా రు. ఏఐ చాట్‌బాట్‌లు ఆరోగ్య సంరక్షణపై ఆశాజనకమైన సమాచారం అందిస్తున్నా, ఆ సమాచారాన్ని నిర్ధారించుకోవడానికి మానవ పర్యవేక్షణతోపాటు బాధ్యతాయుతమైన వ్యవస్థల ఆవశ్యకత ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.