
2025 ఆఖరుకి 30 శాతం సర్వీసుల ఆటోమేషన్
మరింతగా ఇన్వెస్ట్ చేయనున్నసంస్థలు
పెద్ద కంపెనీలపై సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఏఐ) పూర్తిగా ఆటోమేషన్ సాధనంగా కన్నా, మెరుగైన నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలోనే మరింత కీలకంగా ఉపయోగపడుతుందని పలు దిగ్గజ కంపెనీలు భావిస్తున్నాయి. పబ్లికేషన్ సంస్థ సీఐవోఅండ్‌లీడర్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. దీని ప్రకారం 2023 నుంచి వివిధ సృజనాత్మక ప్రక్రియల్లో కంటెంట్ మార్కెటింగ్ నుంచి సాఫ్ట్‌వేర్ కోడింగ్ వరకు జనరేటివ్ ఏఐ వినియోగం అయిదు రెట్లు పెరిగింది. 2025 ఆఖరు నాటికి కంపెనీలు 30 శాతం ఐటీ సరీ్వసులు పూర్తిగా ఏఐతో ఆటోమేట్ చేయనున్నాయి.
వ్యయాలను తగ్గించుకోవడం, ప్రాసెసింగ్, నిర్వహణ సామరŠాధ్యలను పెంచుకోవాలన్న లక్ష్యాలే ఏఐని వినియోగించుకోవడానికి కారణమని 98.4 శాతం కంపెనీలు తెలిపాయి. కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించేందుకు కృత్రిమ మేథ విలువైన సాధనంగా ఉపయోగపడుతుందని 96 శాతం కంపెనీలు వివరించాయి. 2025 మే–జూలై మధ్య నిర్వహించిన సర్వేలో రూ. 5,000 కోట్ల పైగా వార్షిక టర్నోవరు ఉన్న కంపెనీలకు చెందిన 350 మంది చీఫ్ ఐటీ (లేదా) చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్లు పాల్గొన్నారు.
రిపోర్ట్‌లో మరిన్ని విశేషాలు..
→ 2025లో 93 శాతం కంపెనీలు ఏఐ, అనలిటిక్స్‌పై పెట్టుబడులను పెంచనున్నాయి. సగం పైగా సంస్థ లు బడ్జెట్లను భారీగా పెంచే ఆలోచనలో ఉన్నాయి.
→ ఐటీ కార్యకలాపాల్లో ఆటోమేషన్ కోసం, లోపాలను గుర్తించడం వంటి పనులకు 41 శాతం కంపెనీలు ఏఐని వినియోగిస్తున్నాయి.
→ చాట్‌బాట్‌లు, పర్సనలైజేషన్ లాంటి అవసరాల కోసం ఫైనాన్స్ (31 శాతం), కస్టమర్ సర్వీస్ (28 శాతం) విభాగాల్లో ఏఐని వినియోగిస్తున్నారు.
→ 90 శాతం కంపెనీలు డేటా భద్రత, గోప్యతను ఏఐ వినియోగానికి ప్రధాన సవాలుగా ఉంటోంది. డేటా నాణ్యతపరమైన సవాళ్లు ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి.
→ 85 శాతం సంస్థలు ఏఐ సాధనాలను అంతర్గతంగానే తయారు చేసుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి.