
మూడేళ్లలో 5,000 ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ఐటీ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) లండన్‌లో ఆరి్టఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఎక్స్‌పీరియన్స్ జోన్‌కు తెరతీయనుంది. ఏఐ కేంద్రంతోపాటు డిజైన్ స్టుడియోను ఏర్పాటు చేయనున్నట్లు టీసీఎస్ పేర్కొంది. తద్వారా యూకేలో పెట్టుబడులను కొనసాగించనున్నట్లు తెలియజేసింది.
ఈ నేపథ్యంలో రానున్న మూడేళ్లలో అక్కడ దేశవ్యాప్తంగా 5,000 ఉద్యోగాలను కల్పించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం యూకేలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 42,000 మందికిపైగా మద్దతిస్తున్నట్లు తెలియజేసింది. అకాడమిక్ ఇన్‌స్టిట్యూషన్స్, స్టార్టప్స్‌సహా ఇతర భాగస్వామ్యాలతో నెలకొల్పిన ఇన్నొవేషన్ ఎకోసిస్టమ్‌ను వినియోగించుకోనున్నట్లు వివరించింది.