
స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ నథింగ్ (Nothing)లో వెల్త్‌టెక్ యూనికార్న్ సంస్థ జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ (Nikhil Kamath) 2.1 కోట్ల డాలర్లు(రూ. 186 కోట్లు) ఇన్వెస్ట్ చేశారు. కంపెనీ ఇటీవల చేపట్టిన 20 కోట్ల డాలర్ల(రూ. 1,775 కోట్లు) నిధుల సమీకరణలో భాగంగా పెట్టుబడులను సమకూర్చినట్లు కామత్ వెల్లడించారు.
1.3 బిలియన్ డాలర్ల(రూ. 11,530 కోట్లు) విలువలో నథింగ్ సిరీస్ సీ రౌండ్‌కు పెట్టుబడులు అందించినట్లు పేర్కొన్నారు. తదుపరి దశ ఏఐ టెక్నాలజీ కంపెనీగా అభివృద్ధి చెందేందుకు ప్రధానంగా నిధుల సమీకరణ చేపట్టనున్నట్లు సెప్టెంబర్‌లో నథింగ్ ప్రకటించింది. నథింగ్‌కు తెరతీయకముందు కార్ల్ పే.. స్మార్ట్‌ఫోన్ల దిగ్గజం వన్‌ప్లస్ సహవ్యవస్థాపకుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.