
రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆన్‌లైన్ ఉనికి విస్తరణలో భాగంగా అమెజాన్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. దీంతో రాయల్ ఎన్‌ఫీల్డ్‌కు చెందిన క్లాసిక్ 350, బుల్లెట్ 350, హంటర్ 350, గోవాన్ క్లాసిక్ 350, కొత్త మీటియోర్ 350 బైక్‌లను అమెజాన్ ఇండియా ద్వారా ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేయోచ్చు.
అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీ, పూణే నగరాల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసినప్పట్టకీ.., డెలివరీ, విక్రయానంతర సేవలను కస్టమర్ ఎంపిక చేసుకున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ సర్వీస్ సెంటర్ ద్వారా అందిస్తామని కంపెనీ తెలిపింది.