హైదరాబాద్‌లో టీసీఎస్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ | TCS, Qualcomm launch innovation hub in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో టీసీఎస్‌ ఇన్నోవేషన్‌ హబ్‌

Nov 21 2019 5:34 AM | Updated on Nov 21 2019 5:34 AM

TCS, Qualcomm launch innovation hub in Hyderabad - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఐటీ సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) హైదరాబాద్‌లో ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేసింది. వైర్‌లెస్‌ టెక్నాలజీ అగ్రగామి క్వాల్‌కామ్‌ టెక్నాలజీస్‌ సహకారంతో దీనిని స్థాపించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్న సంస్థల నూతన డిజిటల్‌ అవసరాలను తీర్చేందుకు ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, 5జీ టెక్నాలజీని ఆసరాగా చేసుకుని డొమెయిన్‌ ఆధారిత పరిష్కారాలను ఈ కేంద్రంలో అభివృద్ధి చేస్తారు. ఆరోగ్యం, వాహన, తయారీ, చిల్లర వర్తకం వంటి వివిధ రంగాల్లో 5జీ వినియోగం ద్వారా కొత్త అవకాశాలను కనుగొంటారు. ఈ పరిష్కారాలతో కస్టమర్లు సరికొత్త వ్యాపార పద్ధతులు, విభిన్న ఉత్పత్తులు, విలువ ఆధారిత సేవలతోపాటు వినియోగదార్లకు మెరుగైన అనుభూతి కలిగించేందుకు దోహదం చేస్తుందని టీసీఎస్‌ తెలిపింది. తద్వారా కంపెనీలకు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయని వివరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement