
కోవాసెంట్ టెక్నాలజీస్ తాజాగా ఏఐ ఏజెంట్ కంట్రోల్ టవర్ (ఏఐ–యాక్ట్) పేరిట కొత్త టూల్‌ను ఆవిష్కరించింది. వివిధ ఏఐ ప్రోగ్రాంలను (లేదా ఏజెంట్లను) సమన్వయపర్చుకుంటూ, వాటిని సమర్ధవంతంగా ఉపయోగించుకోవడంలో కంపెనీలకు ఇది సహాయకరంగా ఉంటుంది.
ప్రస్తుతం వివిధ కార్యకలాపాలకు వివిధ ఏఐ ఏజెంట్లను ఉపయోగిస్తుండటం వల్ల గందరగోళం, భద్రతాపరమైన రిస్కులు తలెత్తుతున్నాయని కోవాసెంట్ టెక్నాలజీస్ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఏఐ ఏజెంట్లన్నింటికీ ఏఐ యాక్ట్ అనేది ఒక సెంట్రల్ కంట్రోల్ రూమ్‌లాగా పని చేస్తుందని ఆయన వివరించారు.