Pakistan: శుభాకాంక్షలకు ‘ఏఐ’.. ప్రధానిపై నెటిజన్ల ఆగ్రహం | Pakistan PM Sharif Wishes Happy Diwali Netizens Flag 100 AI Written | Sakshi
Sakshi News home page

Pakistan: శుభాకాంక్షలకు ‘ఏఐ’.. ప్రధానిపై నెటిజన్ల ఆగ్రహం

Oct 21 2025 12:34 PM | Updated on Oct 21 2025 12:45 PM

Pakistan PM Sharif Wishes Happy Diwali Netizens Flag 100 AI Written

న్యూఢిల్లీ: పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దీపావళి  సందర్భంగా హిందువులకు అందించిన శుభాకాంక్షలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ఆయన సోషల్ మీడియా వేదికగా  చేసిన పోస్టుపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విమర్శలతో విరుచుకు పడుతున్నారు. ఒకవైపు పాకిస్తాన్‌లోని మైనారిటీలైన హిందువులపై దాడులు జరుగుతుండగా, మరోవైపు ఈ రకంగా ఈ శుభాకాంక్షలు చెప్పడమేమిటని ప్రశ్నిస్తున్నారు. పైగా దీపావళి శుభాకాంక్షలు చెప్పేందుకు ప్రధాని షరీఫ్‌ ‘ఏఐ’  వినియోగించారని ఆరోపిస్తున్నారు. 

పాక్‌ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన సోషల్ మీడియా ఖాతాలో హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి దీపావళి  ఒక గుర్తు. ఈ పండుగ శాంతి, సామరస్యం, కరుణలను మనలో పెంపొందించి, ఉమ్మడి శ్రేయస్సు వైపు నడిపించాలి’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్  చూసిన నెటిజన్లు ప్రధాని షరీఫ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్‌లో హిందువులు ఎదుర్కొంటున్న హింసను గుర్తు చేస్తూ, ప్రధాని అందించిన ఈ సందేశానికి ఏమైనా అర్థం ఉందా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
 

ఒక యూజర్‌ ‘అసలు పాకిస్తాన్‌లో హిందువులెవరైనా మిగిలి ఉన్నారా? అని ప్రశ్నించగా, మరొకరు అక్కడి బలవంతపు మతమార్పిడులు, దేవాలయాలపై దాడుల ఘటనలను ప్రస్తావించారు. ‘పహల్గామ్‌లో హిందువులను హత్య చేశాక ఇలా దీపావళి శుభాకాంక్షలు చెప్పడం సిగ్గుచేటంటూ మరొకరు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒక యూజర్‌  ‘ఇది దౌత్యమా? లేక  చాట్‌ జీపీటీ మీ ఖాతాను హ్యాక్ చేసిందా?’ అని ప్రశ్నించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement