వాట్సాప్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌.. ఫీచర్లు ఇవే.. | WhatsApp Plus Subscription Will Messaging Soon Cost Premium | Sakshi
Sakshi News home page

వాట్సాప్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌.. ఫీచర్లు ఇవే..

Mar 7 2026 8:48 AM | Updated on Mar 7 2026 9:39 AM

WhatsApp Plus Subscription Will Messaging Soon Cost Premium

వాట్సాప్ తన వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్లను పరిచయం చేసే క్రమంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తరహాలోనే వాట్సాప్ ‘వాట్సాప్ ప్లస్’ పేరుతో సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే, ఇకపై వాట్సాప్ వాడాలంటే డబ్బులు కట్టాలా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. దీనికి సంబంధించిన అంశాలు కింద చూద్దాం.

వాట్సాప్ ప్లస్‌లో స్పెషల్ ఫీచర్లు

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, పెయిడ్ ప్లాన్ తీసుకునే వినియోగదారులకు ఈ కింది ప్రత్యేక ప్రయోజనాలు లభించవచ్చు.

ఫీచర్వివరణ
చాట్ పిన్సాధారణంగా 3 చాట్లు మాత్రమే పిన్ చేయగలం, కానీ ఇందులో 20 చాట్ల వరకు పిన్ చేయవచ్చు.
కస్టమైజేషన్యాప్ ఐకాన్ రంగులు, ట్యాబ్లు, బటన్లు మార్చుకునే సౌలభ్యం.
థీమ్స్, స్టిక్కర్స్ఎక్స్‌క్లూజివ్‌ థీమ్స్, స్పెషల్ స్టిక్కర్ ప్యాక్స్.
రింగ్‌టోన్స్‌కాంటాక్ట్స్ కోసం కస్టమ్ రింగ్‌టోన్స్‌ సెట్ చేసుకునే ఆప్షన్.
రియాక్షన్స్మెసేజ్ రియాక్షన్ల రంగులను మార్చుకునే వెసులుబాటు.

 

వినియోగదారులు గమనించాల్సిన విషయం ఏమిటంటే.. వాట్సాప్ ప్లస్ అనేది పూర్తిగా ఆప్షనల్‌ మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఎలాంటి సర్వీసులు ఉచింతంగా అందుబాటులో ఉంటాయో కింద చూద్దాం.

ఇదీ చదవండి: ఫ్లిప్‌కార్ట్‌లో పనితీరుపై సమీక్ష

WhatsApp Plus1
1/3

WhatsApp Plus2
2/3

WhatsApp Plus3
3/3

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement