మహీంద్రా ఈ–ఆటో ‘ఉడో’.. ధర ఎంతంటే.. | Mahindra launched UDO next generation electric three wheeler | Sakshi
Sakshi News home page

మహీంద్రా ఈ–ఆటో ‘ఉడో’.. ధర ఎంతంటే..

Feb 13 2026 8:36 AM | Updated on Feb 13 2026 10:01 AM

Mahindra launched UDO next generation electric three wheeler

మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా లాస్ట్‌ మైల్‌ మొబిలిటీ తాజాగా ‘ఉడో’ పేరిట ఎలక్ట్రిక్‌ ఆటోను గురువారమిక్కడ ఆవిష్కరించింది. దీని ఎక్స్‌షోరూం ధర రూ. 3,84,299 కాగా పరిమిత కాలం పాటు రూ. 3,58,999కి అందించనున్నట్లు సంస్థ ఎండీ సుమన్‌ మిశ్రా తెలిపారు. రిటైల్‌ విక్రయాలు ప్రారంభించామని, ఈ వారంలో డెలివరీలు మొదలవుతాయని చెప్పారు.

తెలంగాణలోని జహీరాబాద్‌ ప్లాంటులో దీన్ని ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. ఇందుకోసం రూ. 500 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు మిశ్రా చెప్పారు. ఉడో ఒక్కసారి చార్జి చేస్తే 200 కి.మీ. రేంజి ఇస్తుందని, గరిష్టంగా గంటకు 55 కి.మీ. వేగం ఉంటుందని పేర్కొ న్నారు. 1.5 లక్షల కి.మీ. లేదా 6 ఏళ్ల వారంటీ ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగానే విక్రయా లపై దృష్టి పెడుతున్నామని, అవకాశాలను బట్టి ఎగుమతి కూడా చేస్తామని మిశ్రా తెలిపారు.

ఇదీ చదవండి: రెరా బిల్డర్లకే కొమ్ముకాస్తోంది: సుప్రీంకోర్టు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement