వందే భారత్‌లో ప్రయాణించిన నిర్మలా సీతారామన్ | Nirmala Sitharaman Travels To Jaipur By Vande Bharat For Key BRICS Meeting, Interacts With Young Journalists, Photos Went Viral | Sakshi
Sakshi News home page

వందే భారత్‌లో ప్రయాణించిన నిర్మలా సీతారామన్

Aug 12 2026 9:05 AM | Updated on Aug 12 2026 10:22 AM

Nirmala Sitharaman Travels by Vande Bharat Express to Jaipur for Key BRICS Meeting

బ్రిక్స్ దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల కీలక సమావేశాల్లో పాల్గొనేందుకు కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ న్యూఢిల్లీ నుంచి రాజస్థాన్‌లోని జైపూర్‌కు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో పయనం అయ్యారు. ‘రెసిలియెన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ’ ప్రాతిపదికన జైపూర్‌లో ఈ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ సదస్సు జరుగుతోంది.

ఈ ప్రయాణంలో భాగంగా రైలులోని సహ ప్రయాణికులతో మంత్రి నేరుగా ముచ్చటించారు. ప్రత్యేకించి మీడియా ఎడ్యుకేషన్‌ అభ్యసిస్తున్న విద్యార్థులు, యువ జర్నలిస్టులతో ఆమె సంభాషించారు. అంతర్జాతీయ భూరాజకీయాలు (జియోపాలిటిక్స్), భారత ఆర్థిక వ్యవస్థ, ప్రాధాన్య రంగాలు, యువత ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆకాంక్షలపై వారితో చర్చించారు. దేశ విధాన నిర్ణేతతో నేరుగా అభిప్రాయాలు పంచుకునే అవకాశం దక్కడంపై యువకులు సంతోషం వ్యక్తం చేశారు.

ఒకపక్క ఉన్నతస్థాయి దౌత్య సమావేశానికి వెళ్తూనే వందే భారత్‌లో ప్రయాణించి ప్రయాణికులతో, యువతతో మమేకం కావడం మంత్రి విలక్షణ శైలిని ప్రతిబింబిస్తోందని కొందరు చెబుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వెల్లడించింది.

ఇదీ చదవండి: ‘నన్ను నగ్నంగా మార్చకండి!’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement