హోండా టూవీలర్‌ స్పెషల్‌ ఎడిషన్లు | Honda launched two new limited editions in India for 2026 | Sakshi
Sakshi News home page

హోండా టూవీలర్‌ స్పెషల్‌ ఎడిషన్లు

Feb 5 2026 7:53 AM | Updated on Feb 5 2026 8:36 AM

Honda launched two new limited editions in India for 2026

హోండా మోటార్‌సైకిల్‌–స్కూటర్‌ ఇండియా తన పోర్ట్‌ఫోలియో విస్తరణలో భాగంగా ‘షైన్‌ 125 లిమిటెడ్‌’, ‘డియో 125 ఎక్స్‌–ఎడిషన్‌’లను మార్కెట్లోకి విడుదల చేసింది. హోండా పాపులర్‌ బ్రాండ్‌ ‘షైన్‌’ దేశ వ్యాప్తంగా మంచి ప్రజాదారణ పొందింది. మారుతున్న ట్రెండ్స్‌ను దృష్టిలో ఉంచుకుని, కొత్త కస్టమర్లను ఆకర్షించేందుకు తాజాగా హోండా షైన్‌ ‘125 లిమిటెడ్‌ ఎడిషన్‌’ను విడుదల చేసింది. మినిమలిస్ట్‌ థీమ్‌తో పెర్ల్‌ సైరెన్‌ బ్లూ కలరులో అందుబాటులో ఉండే ఈ ఎడిషన్, పైరైట్‌ బ్రౌన్‌ ఆలాయ్‌ వీల్స్‌తో వస్తుంది. ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ ఇంజిన్‌ ఎలాంటి మార్పులు చేయలేదు. ధర ఢిల్లీ ఎక్స్‌ షోరూం వద్ద రూ.86,211గా ఉంది.  

హోండా డియో 125 ఎక్స్‌–ఎడిషన్‌

యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించబడిన ఆధునిక స్కూటర్‌. ప్యానెల్లపై ప్రత్యేక గ్రాఫిక్స్‌తో ఈ ఎడిషన్‌ సైబర్‌ డ్రిఫ్ట్‌ థీమ్‌ ప్రేరణతో తీర్చిదిద్దారు. నగర ప్రయాణాలకు సరైన మైలేజ్, స్మూత్‌ డ్రైవింగ్‌ అనుభవాన్ని అందిస్తుంది. ఇంజిన్‌లో ‘ఇండ్లింగ్‌ స్టాప్‌ సిస్టమ్‌’ ఉండటం వల్ల ట్రాఫిక్‌లో నిలిచినప్పుడు ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అవుతూ ఇంధనాన్ని ఆదా చేస్తుంది. ధర విషయానికొస్తే..., ఢిల్లీ ఎక్స్‌ షోరూం వద్ద రూ.87,733గా ఉంది. ఇప్పటికే ఈ స్పెషల్‌ ఎడిషన్‌ బుకింగ్‌లు మొదలయ్యాయి. కస్టమర్లు ఈ మోడళ్లను కంపెనీ ఆన్‌లైన్‌లో కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా, ఆఫ్‌లైన్‌లో దగ్గర్లోని డీలర్‌షిప్‌ ద్వారా బుక్‌ చేసుకోవచ్చు. ఫిబ్రవరి రెండో వారం నుంచి డెలివరీ తీసుకోవచ్చు.

ఇదీ చదవండి: వ్యక్తిగత సంపదలో 75 శాతం విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement