ఢిల్లీలో గాలి కాలుష్య విపరీతంగా పెరుగుతున్న సమయంలో.. బీఎస్4 వాహనాలపై నిషేధం విధించి, బీఎస్6 వాహనాలకు మాత్రమే అనుమతిస్తూ.. అక్కడి ప్రభుత్వం కఠినమైన నిబంధనలు జారీ చేసింది. అయితే ఇప్పుడు చాలామంది బీఎస్4 వాహనాలు ఏవి?, బీఎస్6 వాహనాలు ఏవి?.. వాటిని ఎలా గుర్తించాలి అనే విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
2020 ఏప్రిల్ వరకు బీఎస్4 వాహనాలనే కంపెనీలు తయారు చేసేవి. కానీ, ఆ తరువాత బీఎస్6 వాహనాలు తయారు చేయాలని.. వాహన తయారీ సంస్థలను భారత ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానంగా వాయు కాలుష్యం తగ్గించడంలో భాగంగానే.. ఈ కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. ఈ నియమాన్ని పాటిస్తూ.. వాహన తయారీ సంస్థలు బీఎస్6 వాహనాలను తయారు చేయడం మొదలుపెట్టాయి.
బీఎస్4 వాహనాలు vs బీఎస్6 వాహనాలు
| అంశం | BS-4 వాహనాలు | BS-6 వాహనాలు |
|---|---|---|
| కాలుష్యం | ఎక్కువ | చాలా తక్కువ |
| NOx ఉద్గారాలు | ఎక్కువ | ~60–70% తక్కువ |
| PM (ధూళి కణాలు) | ఎక్కువ | ~80–90% తక్కువ |
| ఇంధన సల్ఫర్ స్థాయి | 50 ppm | 10 ppm |
| డీజిల్ DPF | తప్పనిసరి కాదు | తప్పనిసరి |
| రియల్-టైమ్ ఎమిషన్ మానిటరింగ్ | లేదు | ఉంటుంది |
| నిర్వహణ ఖర్చు | తక్కువ | కొంచెం ఎక్కువ |
| వాహన ధర | తక్కువ | కొంచెం ఎక్కువ |
| నగరాల్లో అనుమతి | కాలుష్య సమయంలో ఆంక్షలు | సాధారణంగా అనుమతి |
| పర్యావరణ ప్రభావం | ప్రతికూలం | అనుకూలం |
BS-6 vs BS-4 వాహనాలను ఎలా గుర్తించాలంటే?
మీ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) ద్వారా అది ఏ ఉద్గార ప్రమాణాలను అనుసరిస్తోందో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎమిషన్ నార్మ్స్ / బీఎస్ నార్మ్స్ అనే కాలమ్‌లో BS-IV లేదా BS-4 వెహికల్ అని ఉంటుంది. దీనిని బట్టి మీ వాహనం ఏ కేటగిరికి చెందిందో ఇట్టే కనుక్కోవచ్చు. అంతే కాకుండా కొన్ని కంపెనీలు వాహనంపైనే బీఎస్6 లేదా బీఎస్4 అని మెన్షన్ చేసి ఉంటాయి.
ఇదీ చదవండి: కొత్త రూల్స్.. లక్షల వాహనాలపై ప్రభావం!


