breaking news
BS6 Standards Vehicles
-
ఎయిర్ పొల్యుషన్ ఎఫెక్ట్: BS6 vs BS4 వాహనాల మధ్య తేడా..
ఢిల్లీలో గాలి కాలుష్య విపరీతంగా పెరుగుతున్న సమయంలో.. బీఎస్4 వాహనాలపై నిషేధం విధించి, బీఎస్6 వాహనాలకు మాత్రమే అనుమతిస్తూ.. అక్కడి ప్రభుత్వం కఠినమైన నిబంధనలు జారీ చేసింది. అయితే ఇప్పుడు చాలామంది బీఎస్4 వాహనాలు ఏవి?, బీఎస్6 వాహనాలు ఏవి?.. వాటిని ఎలా గుర్తించాలి అనే విషయం తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.2020 ఏప్రిల్ వరకు బీఎస్4 వాహనాలనే కంపెనీలు తయారు చేసేవి. కానీ, ఆ తరువాత బీఎస్6 వాహనాలు తయారు చేయాలని.. వాహన తయారీ సంస్థలను భారత ప్రభుత్వం ఆదేశించింది. ప్రధానంగా వాయు కాలుష్యం తగ్గించడంలో భాగంగానే.. ఈ కొత్త రూల్ తీసుకురావడం జరిగింది. ఈ నియమాన్ని పాటిస్తూ.. వాహన తయారీ సంస్థలు బీఎస్6 వాహనాలను తయారు చేయడం మొదలుపెట్టాయి.బీఎస్4 వాహనాలు vs బీఎస్6 వాహనాలుఅంశంBS-4 వాహనాలుBS-6 వాహనాలుకాలుష్యంఎక్కువచాలా తక్కువNOx ఉద్గారాలుఎక్కువ~60–70% తక్కువPM (ధూళి కణాలు)ఎక్కువ~80–90% తక్కువఇంధన సల్ఫర్ స్థాయి50 ppm10 ppmడీజిల్ DPFతప్పనిసరి కాదుతప్పనిసరిరియల్-టైమ్ ఎమిషన్ మానిటరింగ్లేదుఉంటుందినిర్వహణ ఖర్చుతక్కువకొంచెం ఎక్కువవాహన ధరతక్కువకొంచెం ఎక్కువనగరాల్లో అనుమతికాలుష్య సమయంలో ఆంక్షలుసాధారణంగా అనుమతిపర్యావరణ ప్రభావంప్రతికూలంఅనుకూలంBS-6 vs BS-4 వాహనాలను ఎలా గుర్తించాలంటే?మీ వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) ద్వారా అది ఏ ఉద్గార ప్రమాణాలను అనుసరిస్తోందో ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎమిషన్ నార్మ్స్ / బీఎస్ నార్మ్స్ అనే కాలమ్‌లో BS-IV లేదా BS-4 వెహికల్ అని ఉంటుంది. దీనిని బట్టి మీ వాహనం ఏ కేటగిరికి చెందిందో ఇట్టే కనుక్కోవచ్చు. అంతే కాకుండా కొన్ని కంపెనీలు వాహనంపైనే బీఎస్6 లేదా బీఎస్4 అని మెన్షన్ చేసి ఉంటాయి.ఇదీ చదవండి: కొత్త రూల్స్.. లక్షల వాహనాలపై ప్రభావం! -
కొత్త రూల్స్.. లక్షల వాహనాలపై ప్రభావం!
ఢిల్లీలో వాయు కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. ఈ తరుణంలో ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సిర్సా, దేశ రాజధానిలో వాహన కార్యకలాపాలపై కొత్త ఆంక్షలను ప్రకటించారు. డిసెంబర్ 18 నుంచి బీఎస్4 వాహనాలు నగరంలో ప్రవేశించకూడదని వెల్లడించారు.ఢిల్లీ వెలుపల రిజిస్టర్ చేసుకున్న BS4, BS3 వాహనాల ప్రవేశంపై కఠినమైన పరిమితులను విధించారు. పాత పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాల వల్ల పెరుగుతున్న గాలి నాణ్యత సమస్యలను పరిష్కరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. నిర్మాణ సామగ్రిని రవాణా చేసే ట్రక్కులపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి తన ప్రకటనలో హెచ్చరించారు. ఉల్లంఘనలకు పాల్పడితే ఈ వాహనాలపై జరిమానాలు విధించడం మాత్రమే కాకుండా.. స్వాధీనం చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు.లక్షల వాహనాలపై ప్రభావం!ప్రధానంగా.. ఢిల్లీ వెలుపల రిజిస్టర్ చేసుకున్న BS-VI కాని వాహనాల ప్రవేశాన్ని అక్కడి ప్రభుత్వం పూర్తిగా నిషేధించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం లక్షల వాహనాలు ఢిల్లీలో ప్రవేశించకుండా చేస్తుంది. 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న పాత డీజిల్ వాహనాలు, 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసైన పాత పెట్రోల్ వాహనాలను కలిగి ఉన్న రోజువారీ ప్రయాణికులు ఈ నిషేధం వల్ల ప్రభావితమవుతారు.బీఎస్6 ప్రమాణాలు తప్పనిసరిఇప్పుడు ఢిల్లీలో తిరగాలంటే.. మీ వాహనం బీఎస్6 ఉద్గార ప్రమాణాలను అనుగుణంగా ఉండాల్సిందే. 2020 ఏప్రిల్ తరువాత ఈ బీఎస్6 రూల్స్ అమలులోకి వచ్చాయి. కాబట్టి 2020 తరువాత తయారైన దాదాపు అన్ని వాహనాలు దీనికి అనుగుణంగా అప్డేట్స్ పొందాయి. బీఎస్6 వాహనాలు (పెట్రోల్, డీజిల్) మాత్రమే కాకుండా.. CNG, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు నగరంలో తిరగవచ్చు.మోటారు వాహనాల చట్టం ప్రకారం.. నిబంధనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానా విధిస్తారు. పదే పదే ఉల్లంఘనలకు పాల్పడితే.. వాహనాలను జప్తు చేస్తారు. అంతే కాకుండా చెల్లుబాటు పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా తప్పనిసరి. లేకుంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఇదీ చదవండి: మరింత ధనవంతులు కావడం ఎలా?: కియోసాకి ట్వీట్ -
BS6: మారుతి లవర్స్‌కు గుడ్ న్యూస్, మారుతీ వాహనాలన్నీ అప్‌గ్రేడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్టేజ్-6 ఉద్గార ప్రమాణాలు రెండవ దశ కింద అన్ని మోడళ్లను అప్‌గ్రేడ్ చేసినట్టు వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించింది. హ్యాచ్బ్యాక్స్, సెడాన్స్, ఎంపీవీలు, ఎస్‌యూవీలతోపాటు వాణిజ్య వాహనాలు సైతం వీటిలో ఉన్నాయని కంపెనీ తెలిపింది. (వివో ఎక్స్ 90, 90ప్రొ స్మార్ట్ఫోన్లు లాంచ్, ధరలు చూస్తే) ఈ20 ఇంధనం వినియోగానికి అనువుగా వీటిని తీర్చిదిద్దినట్టు పేర్కొంది. కాలుష్యం ఏ స్థాయిలో వెలువడుతుందో ఎప్పటికప్పుడు తెలిపే ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (ఓబీడీ) సిస్టమ్‌ను వాహనంలో అమర్చినట్టు వివరించింది. అన్ని మోడళ్లు ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ) వ్యవస్థను కలిగి ఉన్నాయని ప్రకటించింది. కంపెనీ ఖాతాలో ప్రస్తుతం 15 మోడళ్లు ఉన్నాయి. (ఇదీ చదవండి: అదరగొట్టిన మారుతి సుజుకి: భారీ డివిడెండ్ ) -
సరికొత్త ముస్తాబుతో డుకాటీ ‘‘స్క్రాంబ్లర్’’
సాక్షి, న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్‌బైకుల తయారీ సంస్థ డుకాటీ శుక్రవారం 2021 డుకాటీ స్క్రాంబ్లర్ రేంజ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన ఈ మోడల్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఐకాన్ డార్క్ వేరియంట్ రూ.7.99 లక్షలుగా ఉంది. స్క్రాంబర్ల్ ఐకాన్, ఐకాన్ డార్క్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.8.49 లక్షలు, రూ.10.99 లక్షలుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉండే డుకాటీ డీలర్ షాపుల్లో బైకులను బుక్ చేసుకోవచ్చని, జనవరి 28 నుంచి డెలివరీలు మొదలవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యధిక కస్టమర్లు మెచ్చే బైకుల జాబితాలో స్క్రాంబ్లర్ రేంజ్ మోడళ్లు ఎల్లప్పుడూ స్థానాన్ని కలిగి ఉంటాయని ఆవిష్కరణ సందర్భంగా డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర తెలిపారు. -
హీరో మాస్ట్రో ఎడ్జ్ స్కూటర్, ధర ఎంతంటే..
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బుధవారం మాస్ట్రో ఎడ్జ్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద దీని ధర రూ.72,950 గా ఉంది. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేసిన ఈ 125 సీసీ మోడల్ 8 బ్రేక్ హార్స్ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ‘‘మా స్కూటర్ బ్రాండ్ మాస్ట్రో ఎడ్జ్‌కు మార్కెట్లో మంచి పేరుంది. ఈ కొత్త మోడల్ చేరికతో బ్రాండ్ ఆకర్షణ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాము’’ అని హీరో మోటోకార్ప్ సేల్స్ విభాగపు అధిపతి నవీన్ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆటో మార్కెట్ కోలుకునేందుకు రానున్న వారాల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తామని చౌహాన్ పేర్కొన్నారు.


