మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశంలో తన థార్ ధరలను సవరించింది. కంపెనీ అన్ని వేరియంట్ల ధరలను రూ. 20వేలు పెంచింది. ఈ కొత్త ధరలు వెంటనే అమల్లోకి వస్తాయి.
మహీంద్రా థార్ బేస్ వేరియంట్ అయిన AX 2WD ధరలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. కాబట్టి దీని రేటు రూ. 9.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వద్ద అలాగే కొనసాగుతుంది. 2WD & 4WD కాన్ఫిగరేషన్‌లలో మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో లభించే.. LX ట్రిమ్‌లతో సహా అన్ని ఇతర వెర్షన్‌లు ఇప్పుడు రూ. 20,000 పెరిగాయి.
ధరల పెరుగుదల తరువాత.. మహీంద్రా థార్ టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 17.19 లక్షలకు చేరింది. ఈ ఆఫ్ రోడర్ కారు పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఎంపికలతో.. మాన్యువల్, ఆటోమాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. ఇది ఇండియన్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన లైఫ్ స్టైల్ ఆఫ్ రోడర్‌లలో ఒకటిగా నిలిచింది.
ఇదీ చదవండి: మార్కెట్లో ఫుల్ డిమాండ్: ఈ కారు ధర ఎంతో తెలుసా?


