ముంబై: గణతంత్ర దినోత్సవం సందర్భంగా మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా ట్రాక్టర్స్ సంస్థ తమ యువో టెక్‌ప్లస్ 585 డీఐ 4డబ్ల్యూడీ శ్రేణి ట్రాక్టర్లలో లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. త్రివర్ణ పతాక స్ఫూర్తితో మూడు రంగుల్లో (మెటాలిక్ ఆరెంజ్, ఎవరెస్ట్ వైట్, మెటాలిక్ గ్రీన్), పరిమిత సంఖ్యలో ఈ ట్రాక్రట్లు లభిస్తాయని సంస్థ తెలిపింది.
జెరీక్యాన్, మహీంద్రా ఫ్లాగ్‌లాంటి యాక్సెసరీలు వీటిలో ఉంటాయని వివరించింది. జనవరి 26 నుంచి ఇవి తమ డీలర్‌షిప్‌లలో లభిస్తాయని పేర్కొంది. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా సరికొత్తగా తీర్చిదిద్దిన బొలెరో క్యాంపర్, బొలెరో పికప్ శ్రేణిని కూడా ఆవిష్కరించింది.
క్యాంపర్‌లో ఐమ్యాక్స్ టెలీమ్యాటిక్స్ సొల్యూషన్, పికప్‌లో ఎయిర్ కండీషనింగ్, హీటింగ్ ఫీచర్లు ఉంటాయని వివరించింది. క్యాంపర్ ధర రూ. 9.85 లక్షల నుంచి, పికప్ ధర రూ. 9.19 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.


