
విరాట్ కోహ్లి.. కెప్టెన్‌గా, ఆటగాడిగా తన పేరును భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. కెప్టెన్‌గా ఐసీసీ టైటిల్‌ను సాధించికపోయినప్పటికి భారత జట్టుకు ఎన్నో అద్బుతమైన విజయాలను అందించాడు.
అతడి నాయకత్వంలోనే తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. అంతేకాకుండా భారత జట్టును ఐదేళ్ల పాటు నంబర్ 1 జట్టుగా కోహ్లి నిలిపాడు. అప్పటి హెడ్ కోచ్ రవిశాస్త్రితో కలిసి కోహ్లి అద్బుతాలు చేశాడు. తాజాగా కోహ్లితో తన ప్రయణాన్ని గురించి రవిశాస్త్రి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కింగ్ కోహ్లిపై శాస్త్రి ప్రశంసల వర్షం కురిపించాడు.
"నేను కోచ్‌గా పనిచేసిన అత్యుత్తమ ఆటగాళ్లలో విరాట్ కోహ్లి అగ్రస్ధానంలో ఉంటాడు. అతడొక అద్బుతమైన బ్యాటర్, లీడర్. భారత జట్టును రెడ్ బాల్ ఫార్మాట్‌లో నంబర్ వన్‌గా ఐదేళ్ల పాటు నిలిపాడు. ఆ ఐదేళ్లలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ వంటి సేనా దేశాల్లో టీమిండియా చిరస్మరణీయ విజయాలను అందుకుంది.
అంతేకాకుండా అదే సమయంలో విరాట్ ఫార్మాట్‌తో సంబంధం లేకుండా విదేశాల్లో అత్యద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. అతడు ఆడిన కొన్ని ఇన్నింగ్స్‌లు క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయి. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాక కోహ్లిని భారత జట్టు సారథిగా ఎంపిక చేయాలని నేను సూచించాను.
బ్యాటర్‌గా అతడికి ఉన్న స్కిల్స్, గేమ్ పట్ల మక్కువ, ఆధిపత్యం చెలాయించే నైజం, కష్టపడి ఆడడం వంటి ఎన్నో లక్షణాలు నన్ను ఆకట్టుకున్నాయి" అని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవిశాస్త్రి పేర్కొన్నాడు.
కాగా 2017 నుంచి 2021 వరకూ ఈ వరల్డ్ కప్ విన్నర్ భారత జట్టుకు హెడ్‌కోచ్‌గా సేవలందించాడు. ఇక కాగా ఇంగ్లండ్ పర్యటనకు ముందు టెస్టు క్రికెట్‌కు కోహ్లి వీడ్కోలు పలికి అందరికి షాకిచ్చాడు. తన టెస్టు కెరీర్‌ను 9230 పరుగులతో ఈ ఢిల్లీ బాయ్ ముగించాడు.
చదవండి: PAK vs WI: 'ఇకనైనా దేశం కోసం ఆడండి'.. పాక్ జట్టుపై షోయబ్ అక్తర్ ఫైర్