
ఆసియాకప్-2025 కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. సెప్టెంబర్ 9 నుండి 28 వరకు యూఏఈ వేదికగా ఈ మెగా టోర్నమెంట్ జరగనుంది. అయితే ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గోంటున్నప్పటికి అందరి దృష్టి పాకిస్తాన్-భారత్ టీమ్స్ పైనే ఉంది. ఈ రెండు జట్లు ఎప్పెడ్పుడా తలపడతాయా అని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదుచూస్తున్నారు.
వారి నిరీక్షణకు మరో రెండు వారాల్లో తెరడపడనుంది. సెప్టెంబర్ 14న అబుదాబి వేదికగా చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాక్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఈ ఏషియన్ క్రికెట్ టోర్నీ కోసం పాకిస్తాన్ జట్టు అన్ని విధాల సిద్దమవుతోంది. ఇప్పటికే యూఏఈ గడ్డపై అడుగు పెట్టిన పాక్ జట్టు.. తమ ప్రాక్టీస్‌ను కూడా ముగించింది.
ఆసియాకప్ సన్నాహాకల్లో భాగంగా మెన్ ఇన్ గ్రీన్.. యూఏఈ, అఫ్గాన్ జట్లతో టైసిరీస్‌లో తలపడనుంది. ఈ ముక్కోణపు టీ20 ట్రై సిరీస్ ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 7 వరకు జరగనుంది. అక్కడికి ఒక్క రోజు తర్వాత ఆసియాకప్ ప్రారంభం కానుంది. ఇక ఈ ఆసియాకప్ ప్రిపరేషన్స్‌పై పాకిస్తాన్ యువ సంచలనం హసన్ నవాజ్ అప్‌డేట్ ఇచ్చాడు. ఈ టోర్నీ కోసం తమ సన్నాహకాలు ముగిశాయి, గెలిచేందుకు అన్నివిధాల ప్రయత్నిస్తామని నవాజ్ చెప్పుకొచ్చాడు.
"ఆసియాకప్ కోపం మా ప్రిపరేషన్స్ ముగిశాయి. సాధరణంగా ప్రతీ మ్యాచ్‌లోనూ ఒత్తిడి ఉంటుంది. కానీ మేము ఆటను ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తాము. ప్రతీ మ్యాచ్‌ను ఒక ఛాలెంజ్‌గా తీసుకుని ముందుకు వెళ్తాము. ఇక భారత్-పాక్ మ్యాచ్ గురించి ప్రత్యేక చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ రెండు జట్లు ఎప్పుడు తలపడినా భారీ అంచనాలు నెలకొంటాయి. అయితే మేము మాత్రం ఎటువంటి ఒత్తిడి తీసుకోకుండా మా ప్రణాళికలను సరిగ్గా అమలు చేయాలనుకుంటున్నాము. యూఏఈ కండీషన్స్‌లో బ్యాటింగ్ చేయడం అంత సులువు కాదు. ప్రతీ బంతిని బౌండరీకి తరలించేలా ఇక్కడి పిచ్‌లు లేవు. బంతిని సరిగ్గా అంచనా వేసి ఆడాలి. ప్రతీ బంతికి సిక్స్ కొట్టడం నా ఉద్దేశ్యం కాదు.
కాస్త దూకుడుగా ఆడి ప్రత్యర్ధి బౌలర్లపై ఒత్తిడి తీసుకు రావాలన్నదే నా ప్లాన్. కోచ్ మైక్ హెస్సన్ నుండి నేను చాలా నేర్చుకున్నాను. అతడు మాకు అన్ని విధాలగా సపోర్ట్‌గా ఉంటున్నాడు" అని జియో సూపర్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నవాజ్ పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీలో పాక్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 11న ఒమన్‌తో తలపడనుంది.
చదవండి: నేను ఆడడం ఎవరికైనా సమస్యా? నా రిటైర్మెంట్ అప్పుడే: షమీ