
ఆసియాకప్-2025 కోసం భారత జట్టును అజిత్ అగార్కర్ నేతృత్వంలోని బీసీసీఐ సెలక్షన్ కమిటీ మంగళవారం ప్రకటించింది. ఈ జట్టు ఎంపికపై భిన్నభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ జట్టుకు వైస్‌కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపికచేయడం అందరిని ఆశ్చర్యపరిచింది.
అంతేకాకుండా ఈ ఖండాంత టోర్నీకి స్టార్ ప్లేయర్లు యశస్వి జైశ్వాల్, శ్రేయస్ అయ్యర్‌లను ఎంపిక చేయకపోవడాన్ని చాలా మంది తప్పుబడుతున్నారు. ఈ నేపథ్యంలో సెలక్షన్ కమిటీపై భారత మాజీ క్రికెటర్ మదన్ లాల్ ప్రశ్నల వర్షం కురిపించారు. జైశ్వాల్‌కు చోటు దక్కకపోవడం, హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించడం తనని ఆశ్చర్యపరిచిందని మదన్ లాల్ అన్నారు.
కాగా టీ20 ప్రపంచకప్-2024 తర్వాత భారత జట్టు వైస్ కెప్టెన్సీ నుంచి పాండ్యాను బీసీసీఐ తప్పించింది. టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్, అతడి డిప్యూటీగా అక్షర్ పటేల్‌ను అజిత్ అగార్కకర్ అండ్ కో నియమించింది. కానీ ఇప్పుడు మాత్రం సూర్యకు డిప్యూటీగా శుబ్‌మన్ గిల్‌ను ఎంపిక చేశారు. దీనిబట్టి భవిష్యత్తులో టీ20 జట్టు పగ్గాలు కూడా గిల్ చేపట్టే అవకాశముంది.
"యశస్వి జైశ్వాల్ లాంటి అద్భుతమైన ఆటగాడు జట్టులో లేకపోవడం చూసి నేను షాకయ్యాను. జైశూ ఆరంభం నుంచే ఫియర్ లెస్ క్రికెట్ ఆడుతాడు. అతడు టెస్టుల్లో కూడా ఇదే తరహాలో బ్యాటింగ్ చేస్తున్నారు. సెలక్టర్లు అతడికి విశ్రాంతి ఇచ్చారో లేదా కావాలనే పక్కన పెట్టారో తెలియదు. అతడిని ఆసియాకప్‌నకు ఎంపిక చేసి ఉంటే బాగుండేంది.
అదేవిధంగా హార్దిక్ పాండ్యాను వైస్ కెప్టెన్‌గా ఎందుకు తొలగించారో నాకు ఇప్పటికీ ఆర్ధం కావడం లేదు. కానీ వైస్ కెప్టెన్‌గా గిల్ ఎంపిక సరైన నిర్ణయమే. ఎందుకంటే అతడు ప్రస్తుతం బాగా రాణిస్తున్నాడు. రాబోయే కాలంలో గిల్ మూడు ఫార్మాట్లలోనూ ఆడే అవకాశం ఉంది. మ్యాచ్ విన్నర్లు ప్రతీ ఫార్మాట్‌లోనూ ఆడాలి. ఆసియా కప్ గెలిచే అన్ని అవకాశాలు భారత్‌కు ఉన్నాయి" అని ఎఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మదన్ లాల్ పేర్కొన్నాడు.
ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
రిజర్వు ప్లేయర్లు: ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, యశస్వి జైస్వాల్.
చదవండి: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆటగాళ్లకు ‘అగ్ని పరీక్ష’.. ఏమిటీ బ్రోంకో టెస్టు?