
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి (Virat Kohli) తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. చివరగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ఆడిన కోహ్లి.. మళ్లీ ఇప్పుడు ఏడు నెలల తర్వాత భారత జెర్సీలో కన్పించనున్నాడు. ఈ నెల 19 నుంచి పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో సత్తాచాటేందుకు కింగ్ కోహ్లి ఉవ్విళ్లూరుతున్నాడు.
కాగా ఇప్పటికే టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన కోహ్లి.. ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. దీంతో ఈ మాజీ కెప్టెన్ వన్డే ప్రపంచకప్-2027లో ఆడుతాడా లేదా? అన్నది సగటు క్రికెట్ అభిమాని మొదడను తొలుస్తున్న ప్రశ్న.
రోహిత్, కోహ్లి వన్డే భవిష్యత్తుపై బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ఈ మెగా టోర్నీకి ఇంకా రెండేళ్ల సమయం ఉండడంతో ఇప్పుడే ఏమి చెప్పలేమని అగార్కర్ చెప్పుకొచ్చాడు. అయితే వన్డే ప్రపంచకప్‌లో ఆడాలంటే ఖచ్చితంగా దేశవాళీ టోర్నీ విజయ్ హాజారే ట్రోఫీలో పాల్గోవల్సేందేనని మాత్రం అగార్కర్ తెల్చి చేప్పేశాడు.
కానీ రో-కో ద్వయం విజయ్ హాజారే ట్రోఫీలో ఆడుతారో లేదో మాత్రం తెలియదు. అయితే దేశవాళీ టోర్నమెంట్‌లలో ఆడకపోయినా వారిద్దరని వన్డే ప్రపంచకప్‌నకు ఎంపిక చేయాలని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. మరి కొంతమంది ఆసీస్ టూర్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తారని అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలో కోహ్లి చేసిన ట్విట్ వైరలవుతోంది. "ఎప్పుడైతే మీరు ఓ పనిని మధ్యలోనే వదిలేయాలని నిర్ణయించుకుంటారో.. అప్పుడు మీరు నిజంగా విఫలమైనట్లే" ఎక్స్‌లో కోహ్లి రాసుకొచ్చాడు. దీంతో కింగ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. కోహ్లి రాబోయో వన్డే ప్రపంచకప్‌లో ఆడుతాడని ఫిక్స్ అయిపోతున్నారు.
ఆసీస్‌తో సిరీస్‌కు భారత వన్డే జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్, ధ్రువ్ జురెల్, జైశ్వాల్
చదవండి: పిరికిపందల్లారా!.. చిన్న పిల్లాడు.. వదిలేయండిరా!: టీమిండియా స్టార్ ఫైర్