
దుబాయ్: ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీలో ఆసక్తిని రేపిన పోరులో భారత్ పైచేయి సాధించింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో పాకిస్తాన్‌ను చిత్తు చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ (44 బంతుల్లో 40; 1 ఫోర్, 3 సిక్స్‌లు), షాహిన్ అఫ్రిది (16 బంతుల్లో 33 నాటౌట్; 4 సిక్స్‌లు) రాణించారు.

భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 18 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా... అక్షర్ పటేల్, బుమ్రా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు సాధించి గెలిచింది.

























