
టీమిండియా టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వైరల్ ఫీవర్ కారణంగా దులీప్ ట్రోఫీ-2025కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ దేశవాళీ టోర్నీలో నార్త్ జోన్‌గా కెప్టెన్‌గా గిల్ వ్యవహరించాల్సి ఉండేది. కానీ టోర్నీ ఆరంభానికి ముందు గిల్ జ్వరం బారిన పడ్డాడు.
దీంతో వైద్యుల సూచన మెరకు ఈ రెడ్‌బాల్ క్రికెట్ ఈవెంట్‌ను గిల్ వైదొలిగాడు. ఇక సెప్టెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఆసియాకప్‌పై గిల్ దృష్టిసారించాడు. ఈ క్రమంలో శుబ్‌మన్ శుక్రవారం(ఆగస్టు 29) బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో చేరాడు.
టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. గిల్ జ్వరం నుంచి కోలుకుని శిక్షణ ప్రారంభించినట్లు తెలుస్తోంది. కాగా ఆసియాకప్‌కు ముందు ఆగస్టు 30 లేదా 31న కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలతో కలిసి గిల్ ఫిట్‌నెస్ పరీక్షలను ఎదుర్కొంటాడని వార్తలు వచ్చాయి.
కానీ గిల్ మాదిరే రాహుల్ కూడా వైరల్ ఫీవర్ బారిన పడినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. దీంతో రోహిత్ ఫిట్‌నెస్ పరీక్షను సెప్టెంబర్ 15 వాయిదా వేసినట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. గిల్ ఆసియాకప్‌లో ఆడేందుకు వెళ్లనుండడంతో ఈ ఫిట్‌నెస్ టెస్టులో రాహుల్, రోహిత్ మాత్రమే పాల్గోనున్నారు.
ఆసియాకప్ కోసం టీమిండియా సెప్టెంబర్ 4న దుబాయ్‌కు బయలు దేరనుంది. అయితే భారత జట్టు వేర్వేరు బ్యాచ్‌లగా యూఏఈ గడ్డపై అడుగపెట్టనున్నట్లు సమాచారం. గిల్ బెంగళూరు నుంచి నేరుగా దుబాయ్‌కు వెళ్లనున్నాడు. కాగా భారత టీ20 జట్టులో చాలా మంది సభ్యులు సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్‌లోనే ఉన్నారు.
దుబాయ్‌కు చేరుకున్నాక వారం రోజుల పాటు ట్రైనింగ్ క్యాంపును టీమిండియా ఏర్పాటు చేయనుంది. ఇక ఖండాంతర టోర్నీలో భారత్ తమ తొలి మ్యాచ్‌లో సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. ఈ టోర్నీ కోసం భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. మెన్ ఇన్ బ్లూ కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించనుండగా.. అతడికి డిప్యూటీగా గిల్ ఎంపికయ్యాడు.
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్‌కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్ (వికెట్‌కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్
చదవండి: అదొక అత్యంత వరెస్ట్ టెస్ట్.. ఆటగాళ్లకు కఠిన సవాల్: డివిలియర్స్