టాలీవుడ్ హీరోయిన్‌తో పృథ్వీ షా ప్రేమాయణం..! ఎవరీ అకృతి? | Prithvi Shaw Celebrates Ganesh Chaturthi With His Rumoured Girlfriend Akriti Agarwal, Know About Her In Telugu | Sakshi
Sakshi News home page

టాలీవుడ్ హీరోయిన్‌తో పృథ్వీ షా ప్రేమాయణం..! ఎవరీ అకృతి?

Aug 28 2025 8:12 AM | Updated on Aug 28 2025 8:57 AM

Prithvi Shaw Celebrates Ganesh Chaturthi With Akriti Agarwal

టీమిండియా క్రికెట‌ర్ పృథ్వీ షా తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ అకృతి అగర్వాల్‌తో కలిసి బుధవారం గణేశ్ చతుర్థిని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను అకృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో షేర్ చేసింది. ఇందుకు మీకు, మీ కుటంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.

గణపతి బప్పా మోర్యా" అని క్యాప్షన్‌గా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇందుకు నెటిజన్లు మీ జంట చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. పృథ్వీ భాయ్ నీ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాను అంటూ మరో యూజర్ కామెంట్ చేస్తున్నాడు.

కాగా పృథ్వీ షా తన పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రథ్వీ షా ముంబై క్రికెట్ అసోషియేషన్‌తో తెగదింపులు చేసుకున్న పృథ్వీ.. తన మకాంను మహారాష్ట్రకు మార్చాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ప్రస్తుతం బుచ్చిబాబు టోర్నీలో ఆడుతున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఛత్తీస్‌ఘడ్‌పై సెంచరీతో మెరిసిన పృథ్వీ.. అనంతరం రెండో మ్యాచ్‌లో తమిళనాడు క్రికెట్‌ అసోసియేషన్‌పై సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు.

ఇదే జోరును ఈ ముంబైకర్ కొనసాగిస్తే తిరిగి ఐపీఎల్‌తో పాటు టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. షా చివరిసారిగా జూలై 2021లో తరపున ఆడాడు. అదేవిధంగా తన కెరీర్‌లో మొదటి సారిగా ఐపీఎల్ వేలం‍లో పృథ్వీ అమ్ముడుపోలేదు. ఐపీఎల్‌-2025లో వేలంలో అతడిని కొనుగొలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీంతో తన ఫిట్‌నెస్, బ్యాటింగ్‌పై దృష్టి సారించిన పృథ్వీ షా ఎలాగైనా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు.

 

 

ఎవ‌రీ అకృతి అగర్వాల్‌?
22 ఏళ్ల అకృతి అగర్వాల్‌.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు  ఇన్‌స్టాగ్రామ్‌లో 3.3 మిలియన్ల మంది ఫాలోవర్ల ఉన్నారు. అంతేకాకుండా ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన త్రిముఖ అనే టాలీవుడ్ మూవీలో ఆకృతి హీరోయిన్‌గా నటించింది.  లక్నోలో జన్మించిన ఆకృతి.. ముంబైలోని నిర్మలా మెమోరియల్ కళాశాలలో విద్యను అభ్యసించినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.

ఆమె తన కెరీర్‌ను కంటెంట్ క్రియేటర్‌గా ప్రారంభించింది. . ఆమె యూట్యూబ్ ఛానెల్‌కు 88.8 వేలమంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. పృథ్వీ ,అకృతి ఇద్దరూ ముంబైలో చాలాసార్లు జంటగా కనిపించారు. ఈ ముంబై క్రికెటర్‌ నటి నిధి తపారియాతో బ్రేకప్ తర్వాత అకృతితో ప్రేమలో పడ్డాడు.
చదవండి: DPL: బౌల‌ర్లు ఇక కాస్కోండి.. జూనియర్ సెహ్వాగ్ వ‌చ్చేస్తున్నాడు! వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement