breaking news
vinyakachaviti
-
టాలీవుడ్ హీరోయిన్‌తో పృథ్వీ షా ప్రేమాయణం..! ఎవరీ అకృతి?
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా తన రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ అకృతి అగర్వాల్‌తో కలిసి బుధవారం గణేశ్ చతుర్థిని సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను అకృతి తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో షేర్ చేసింది. ఇందుకు మీకు, మీ కుటంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు.గణపతి బప్పా మోర్యా" అని క్యాప్షన్‌గా ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇందుకు నెటిజన్లు మీ జంట చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. పృథ్వీ భాయ్ నీ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాను అంటూ మరో యూజర్ కామెంట్ చేస్తున్నాడు.కాగా పృథ్వీ షా తన పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నాడు. ప్రథ్వీ షా ముంబై క్రికెట్ అసోషియేషన్‌తో తెగదింపులు చేసుకున్న పృథ్వీ.. తన మకాంను మహారాష్ట్రకు మార్చాడు. ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ ప్రస్తుతం బుచ్చిబాబు టోర్నీలో ఆడుతున్నాడు. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఛత్తీస్ఘడ్పై సెంచరీతో మెరిసిన పృథ్వీ.. అనంతరం రెండో మ్యాచ్‌లో తమిళనాడు క్రికెట్ అసోసియేషన్‌పై సూపర్ హాఫ్ సెంచరీ సాధించాడు.ఇదే జోరును ఈ ముంబైకర్ కొనసాగిస్తే తిరిగి ఐపీఎల్‌తో పాటు టీమిండియాలోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. షా చివరిసారిగా జూలై 2021లో తరపున ఆడాడు. అదేవిధంగా తన కెరీర్లో మొదటి సారిగా ఐపీఎల్ వేలంలో పృథ్వీ అమ్ముడుపోలేదు. ఐపీఎల్-2025లో వేలంలో అతడిని కొనుగొలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీంతో తన ఫిట్నెస్, బ్యాటింగ్‌పై దృష్టి సారించిన పృథ్వీ షా ఎలాగైనా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు. View this post on Instagram A post shared by AKRITI AGARWAL (@akritiagarwal7) ఎవరీ అకృతి అగర్వాల్?22 ఏళ్ల అకృతి అగర్వాల్.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 3.3 మిలియన్ల మంది ఫాలోవర్ల ఉన్నారు. అంతేకాకుండా ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన త్రిముఖ అనే టాలీవుడ్ మూవీలో ఆకృతి హీరోయిన్గా నటించింది. లక్నోలో జన్మించిన ఆకృతి.. ముంబైలోని నిర్మలా మెమోరియల్ కళాశాలలో విద్యను అభ్యసించినట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.ఆమె తన కెరీర్‌ను కంటెంట్ క్రియేటర్‌గా ప్రారంభించింది. . ఆమె యూట్యూబ్ ఛానెల్‌కు 88.8 వేలమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. పృథ్వీ ,అకృతి ఇద్దరూ ముంబైలో చాలాసార్లు జంటగా కనిపించారు. ఈ ముంబై క్రికెటర్ నటి నిధి తపారియాతో బ్రేకప్ తర్వాత అకృతితో ప్రేమలో పడ్డాడు.చదవండి: DPL: బౌలర్లు ఇక కాస్కోండి.. జూనియర్ సెహ్వాగ్ వచ్చేస్తున్నాడు! వీడియో -
‘పండగ’ నేపథ్యంలో అత్యంత అప్రమత్తం
హైదరాబాద్: దాదాపు మూడున్నర దశాబ్ధాల తర్వాత గణేష్ సామూహిక నిమజ్జనం–మిలాద్ ఉన్ నబీ కలిసి వస్తున్న నేపథ్యంలో నగర పోలీసు విభాగం అత్యంత అప్రమత్తంగా ఉండాలని పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు. ఏమరుపాటుకు తావియ్యకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఆయన ఆదివారం డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లతో తన కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గస్తీ బృందాలైన బ్లూకోల్ట్స్, పెట్రోలింగ్ కార్ల సిబ్బంది సైతం ఇందులో పాల్గొన్నారు. ఈ కీలక ఘట్టాన్ని ప్రశాంతంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని అన్ని స్థాయిల అధికారులకు ఆనంద్ సూచించారు. కొత్త అధికారులకు మార్గదర్శనం.. పదోన్నతులు, ఎన్నికల సంఘం మార్గదర్శకాల నేపథ్యంలో జరిగిన బదిలీలతో అనేక మంది అధికారులకు స్థానచలనం తప్పలేదు. ఈ నేపథ్యంలోనే నగరంలోని కొందరు డీసీపీ, ఇన్స్పెక్టర్లు నగరానికి కొత్తగా రావడంతో వారికి ఇదే తొలి కీలక బందోబస్తుగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే వారికి మండపాల ఏర్పాటు నుంచి నిమజ్జనం వాహనాలకు పాసుల కేటాయింపు వరకు ప్రతి అంశాన్నీ కొత్వాల్ ఆనంద్ వివరించారు. నగర పోలీసు విభాగానికే అత్యంత కీలక ఘట్టమైన గణేష్ ఉత్సవాలు, నిమజ్జనానికి ఆరు అంచెల భద్రతా ప్రణాళికను పోలీసు కమిషనర్ అధికారులు, సిబ్బందికి వివరించారు. ఓపక్క భద్రత, మరోపక్క ట్రాఫిక్ నిర్వహణకు సంబంధించి స్పష్టమైన రోడ్‌మ్యాప్ విడుదల చేశారు. ఈ వేడుకలు సజావుగా పూర్తి చేయడానికి ప్రతి దశలోనూ తీసుకోవాల్సిన చర్యలను విశిదీకరించారు. ఈ ఏర్పాట్లలో మొదటి దశ ఇప్పటికే ప్రారంభమైందని... విగ్రహాల ఖరీదు, తరలింపు, ప్రతిష్ట తదితరాలను దీని కిందికి వస్తాయని ఆనంద్ వివరించారు. వీటికి సంబంధించి నిర్వాహకులు పోలీసులు సమాచారం ఇచ్చేలా, ఆన్లైన్ విధానం వినియోగించుకునేలా వారికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. విగ్రహాల విక్రయ కేంద్రాలు, తరలింపు మార్గంతో పాటు ఊరేగింపు మార్గాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. రెండో దశ భద్రతా ప్రణాళికలో భాగంగా క్షేత్రస్థాయి అధికారులు కచ్చితంగా ప్రతి మండపాన్నీ సందర్శించాలని, అక్కడ బారికేడ్లు, సూచికల బోర్డులు, సీసీటీవీలు, క్యూ నిర్వహణ, ట్రాఫిక్ అంశాలను తనిఖీ చేయాలని సూచించారు. మూడో దశలో విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆనంద్ స్పష్టం చేశారు. దీనికోసం నిర్వాహకులతో సమన్వయ సమావేశాలను ఏర్పాటు చేయాలని, అన్ని విభాగాలతో సమన్వయంతో ముందుకు వెళ్ళాలని ఆదేశించారు. నిమజ్జనంపై ప్రత్యేక దృష్టి నాలుగు–ఐదు దశల్లో భాగంగా గణేష్ చవితి ముగిసిన మూడో రోజు నుంచి తీసుకోవాల్సిన చర్యలను విపులీకరించారు. అప్పటి నుంచి నిమజ్జనాలు జరిగే నేపథ్యంలో అవసరమైన క్రేన్ద్రాంల సంఖ్య, మోహరించాల్సిన ప్రాంతాలు గుర్తించాలని, ఊరేగింపు ముగిసిన తర్వాత గస్తీ కొనసాగాలని కొత్వాల్ స్పష్టం చేశారు. ఇలా చేయడం ద్వారా నిమజ్జనం అనంతరం తిరిగి వచ్చే వాహనాలు సురక్షితంగా, సామాన్యులకు ఇబ్బంది లేకుండా తమ గమ్యాలకు చేరుకోవడానికి ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. వీటిలో ప్రతి దశలోనూ హైకోర్టు ఆదేశాలను దృష్టిలో పెట్టుకుని, వాటికి అనుగుణంగానే ముందుకు వెళ్లాలని ఆనంద్ స్పష్టం చేశారు. బేబీ పాండ్స్, తాత్కాలిక చెరువుల్లోనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా, అసాంఘికశక్తులకు చెక్ చెప్పడానికి ఈ ఉత్సవాలు ముగిసే వరకు సున్నిత ప్రాంతాలు, కీలక చోట్ల ఆకస్మిక వాహనాల తనిఖీ, బాంబు నిర్వీర్య బృందాల సోదాలు తప్పనిసరి చేయాలని, సోషల్‌మీడియా పైనా ఓ కన్నేసి ఉంచాలని ఆనంద్ స్పష్టం చేశారు. ‘ఈ ఏడాది జనవరి నుంచి జరిగిన పండుగలతో పాటు ప్రతి ఘట్టాన్ని శాంతియుతంగా పూర్తి చేశాం. అవన్నీ పోలీసు విభాగానికి క్వార్టర్, సెమీ ఫైనల్స్ అయితే... గణేష్ ఉత్సవాల బందోబస్తు, నిమజ్జనం నిర్వహణ ఫైనల్స్ వంటిది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని’ అని ఆనంద్ తన వీడియో కాన్ఫరెన్స్‌లో స్పష్టం చేశారు. -
విద్యుదాఘాతంతో ఇద్దరు బాలురకు గాయాలు
గణేశ్ మండపానికి విద్యుత్ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం ఒకరి పరిస్థితి విషమం ఇల్లంతకుంట : గణేశ్ నవరాత్రోత్సవాలు ప్రారంభం కాక ముందే అపశతి చోటు చేసుకుంది. గణేశ్ మండపానికి విద్యుత్ సరఫరా కోసం ఏర్పాట్లు చేస్తుండగా ఇద్దరు బాలురు షాక్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే ఇల్లంతకుంట ఇందిరమ్మ కాలనీ సమీపంలో కాలనీకి చెందిన విద్యార్థుల వినాయకుడిని ప్రతిష్టించేందుకు మండపం ఏర్పాటు చేశారు. అందులో విద్యుత్ ఏర్పాటు కోసం వైర్లను హైటెన్షన్ వైర్లకు తగిలించారు. మండపంలో సౌండ్ బాక్స్‌లకు కనెక్షన్ ఇస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సారంగి మహేష్(13) తీవ్రంగా, దమ్మని అరవింద్(12) స్వల్పంగా గాయపడ్డారు. మహేష్‌పై విద్యుత్ తీగలు పడి మంటలు అంటుకోవడంతో ఓ ఆటో డ్రై వర్ గమనించి హైటెన్షన్ వైర్లకు తగిలించిన వైర్లను తొలగించాడు. స్థానికులు వెంటనే బాధితులను మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం కరీంనగర్‌కు తీసుకెళ్లారు. మహేష్ పరిస్థితి విషమంగా ఉందని గ్రామస్తులు తెలిపారు.