
'అతడి బ్యాటింగ్‌ను చూస్తుంటే సచిన్, సెహ్వాగ్‌లు గుర్తొస్తున్నారు. అతడు తన టెక్నిక్‌తో బ్రియాన్ లారాను తలపించాడు' పృథ్వీ షా తన అరంగేట్ర టెస్టులో సెంచరీ సాధించిన తర్వాత అప్పటి భారత ప్రధాన కోచ్ రవిశాస్త్రి నోటి నుంచి వచ్చిన మాటలవి.
కానీ రవిశాస్త్రి నమ్మకాన్ని పృథ్వీ షా ఏ మాత్రం నిలబెట్టుకులేకపోయాడు. తన కెరీర్‌ను అద్బుతంగా ఆరంభిచిన ఈ ముంబై క్రికెటర్.. క్రమంగా ఫిట్‌నెస్, ఫామ్ లేమితో భారత జట్టుకు దూరమయ్యాడు. తన ఏడేళ్ల కెరీర్‌లో భారత్ తరపున అన్ని ఫార్మాట్లలో కలిపి 12 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్ విషయాన్ని పక్కన పెడితే ప్రొఫెషనల్ క్రికెట్‌కే అతడు 8 నెలలగా దూరంగా ఉన్నాడు. అండర్-19 ప్రపంచకప్‌లో పృథ్వీషా సారథ్యంలో ఆడిన శుబ్‌మన్ గిల్, అర్ష్‌దీప్ సింగ్, ఇషాన్ కిషన్‌లు సూపర్ స్టార్లగా ఎదిగితే.. ఈ ముంబైకర్ మాత్రం అధ:పాతాళానికి దిగజారిపోయాడు.
రాబోయే రంజీ సీజన్‌కు ముందు ముంబై క్రికెట్ ఆసోషియేషన్‌తో తెగదింపులు చేసుకున్న పృథ్వీ షా తన మకాంను మహారాష్ట్రకు మార్చాడు. ఇక తాజాగా పృథ్వీ షా కెరీర్ పతనంపై రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ దినేష్ లాడ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. పృథ్వీ షా కెరీర్ ఇలా అవ్వడం తనకు ఎంతో బాధ కలిగిస్తుందని ఆయన అన్నారు.
"పృథ్వీ షా తన 10 సంవత్సరాల వయస్సు నుంచి నాకు తెలుసు. అతడు చాలా ప్రతిభావంతుడైన ఆటగాడు. అయితే కెరీర్‌ను విజయవంతంగా మలుచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. పృథ్వీ విషయంలో ఏమి జరిగిందో నాకు అయితే స్పష్టంగా తెలియదు.
కానీ ఇప్పటికీ అతడు టాలెంటెడ్ క్రికెటరే. . దురదృష్టవశాత్తు తప్పుడు మార్గంలో వెళ్లి తన క్రికెట్ కెరీర్‌ను నాశనం చేసుకున్నాడు. పృథ్వీ షా లాంటి బ్యాటర్లు భారత క్రికెట్‌లో ఇప్పుడూ చాలా మంది ఉన్నారు. వైభవ్ సూర్యవంశీ,ఆయుష్ మాత్రే యువ సంచలనాలు ఈ కోవకు చెందిన వారే. వీరు కచ్చింగా ఫ్యూచర్ స్టార్లగా ఎదుగుతారు. భారత క్రికెట్ ప్రస్తుతం టాప్‌లో ఉందని" గౌరవ్ మంగళాని పాడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లాడ్ పేర్కొన్నాడు.
చదవండి: మైదానంలోనే ప్రాణాలు విడిచిన భారత క్రికెటర్.. ఆయన గురించి తెలుసా?