
టీమిండియా తదుపరి వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌ను నియమించేందుకు బీసీసీఐ ఆసక్తి ఉందని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ వారుసుడిగా అయ్యర్ భారత జట్టు వన్డే పగ్గాలను చేపట్టనున్నాడనని రెండు రోజుల నుంచి జోరుగా ప్రచారం సాగుతోంది.
అయ్యర్‌కు ఆసియాకప్ జట్టులో చోటు దక్కని అనంతరం ఈ విషయం బయటకు వచ్చింది. అయితే తాజాగా ఈ వార్తలపై భారత క్రికెట్ బోర్డు స్పందించింది. అవన్నీ వట్టి రూమర్సే అని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా కొట్టిపారేశారు. వన్డే కెప్టెన్సీకి సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని నేనూ విన్నాను. అవన్నీ తప్పుడు వార్తలే. ప్రస్తుతం ఎటువంటి చర్చలు జరగడం లేదు అని సైకియా హిందూస్తాన్ టైమ్స్‌తో పేర్కొన్నారు.
వన్డే కెప్టెన్‌గా గిల్..
అయితే తాజా రిపోర్ట్స్ ప్రకారం.. రోహిత్ శర్మ తర్వాత భారత వన్డే జట్టు బాధ్యతలను శుబ్‌మన్ గిల్‌కే అప్పగించే అవకాశముంది. "వన్డే క్రికెట్‌లో శుబ్‌మన్ గిల్ సగటు 59 పైగా ఉంది. ప్రస్తుతం అతడు జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇటీవలే టెస్టు కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు.
తన తొలి సిరీస్‌లోనే జట్టును అద్భుతంగా నడిపించాడు. అటువంటి ఒక ప్లేయర్ సమయం వచ్చినప్పుడు వన్డే జట్టుకు కూడా నాయకత్వం వహించే అవకాశముంది" అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
కాగా టెస్టు కెప్టెన్‌గా ఉన్న గిల్.. వన్డే, టీ20ల్లో రోహిత్, సూర్యకుమార్ యాదవ్‌లకు డిప్యూటీగా వ్యవహరిస్తున్నాడు. ఆస్ట్రేలియా టూర్ తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలకనున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
ఒకవేళ అదే జరిగితే టెస్టులు మాదిరిగానే వన్డేల్లో కూడా జట్టు పగ్గాలను గిల్ తీసుకునే సూచనలు కన్పిస్తున్నాయి. వీటిన్నంటికి ఓ క్లారిటి రావాలంటే మరో రెండు నెలలు ఎదురు చూడాల్సిందే. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ఆసియాకప్-2025కు సిద్దమవుతోంది.
ఆసియా కప్ టీ20-2025 టోర్నమెంట్‌కు భారత జట్టు
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.
చదవండి: సిరాజ్, రాహుల్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు!?.. బీసీసీఐ ఫైర్