
భారత మహిళా జట్టు స్పిన్నర్, హైదరాబాదీ గౌహెర్ సుల్తానా గురువారం అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. వన్డే, టీ20ల్లో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సుల్తానా తన 17 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలికింది. సుల్తానా 2008లో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసింది.
ఈ హైదరాబాదీ క్రికెటర్ చివరగా భారత్ తరపున 2014లో పాకిస్తాన్‌పై ఆడింది. గౌహెర్ మొత్తంగా తన కెరీర్‌లో 87 మ్యాచ్‌లు ఆడి 95 వికెట్లు పడగొట్టింది. "చాలా సంవత్సరాల పాటు భారత జెర్సీని ధరించినందుకు గర్వంగా ఉంది. అయితే నా క్రికెట్ ప్రయాణాన్ని ముగించేందుకు సమయం అసన్నమైంది.
అన్ని రకాల ఫార్మాట్ల నుంచి తప్పుకొవాలని నిర్ణయించుకున్నాను. నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయి. నాకు మద్దతుగా నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. క్రికెట్ ఎల్లప్పుడూ నా మనసుకు దగ్గరగా ఉంటుంది.
ఒక ప్లేయర్‌గా నా కెరీర్‌కు తెరపడినా.. క్రికెట్ పట్ల నాకున్న ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. నన్ను ఈ స్ధాయికి తీసుకొచ్చిన క్రికెట్‌కు నా సేవలను అందించేందుకు నేను ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాను. ఇది వీడ్కోలు కాదు. ఇది ఒక సువర్ణ అధ్యాయానికి ముగింపు మాత్రమే అని" అని ఇన్‌స్టాలో సుల్తానా రాసుకొచ్చింది.
గౌహెర్ సుల్తానా దేశవాళీ క్రికెట్‌లో హైదరాబాద్, పుదుచ్చేరి, రైల్వేస్, బెంగాల్ తరపున ఆడింది. అంతేకాకుండా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ తొలి రెండు సీజన్లలో ఆమె యూపీ వారియర్స్‌కు ప్రాతినిథ్యం వహించింది.
చదవండి: నా బెస్ట్ కెప్టెన్ అతడే.. ధోనికి కూడా అంత సులువుగా ఏదీ రాలేదు: ద్రవిడ్