
టీమిండియా ఛీప్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పదవీ కాలాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పొడిగించినట్లు తెలుస్తోంది. అగార్కర్ వచ్చే ఏడాది జూన్ వరకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా కొనసాగనున్నాడు.
2023లో ఛీప్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అగార్కర్.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాత తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ బీసీసీఐ అభ్యర్దన మేరకు తన నిర్ణయాన్ని అజిత్ మార్చుకోనున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై కొన్ని నెలల కిందటే అతడితో బీసీసీఐ చర్చలు జరిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీసీసీఐ ఆఫర్‌కు అగార్కకర్ అంగీకరించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో పేర్కొంది.
"అజిత్ అగార్కర్ పదవీకాలంలో భారత పురుషల క్రికెట్ జట్టు రెండు ఐసీసీ టైటిల్స్‌ను గెలుచుకుంది. అంతేకాకుండా టెస్టులు, టీ20ల్లో భారత జట్టు పురోగతి సాధించింది. దీంతో భారత క్రికెట్ బోర్డు అతడి కాంట్రాక్ట్‌ను జూన్ 2026 వరకు పొడిగించింది. కొన్ని నెలల క్రితమే ఈ ఆఫర్‌ను అతడు అంగీకరించాడు" అని ఓ బీసీసీఐ అధికారి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో చెప్పుకొచ్చారు.
కాగా అగార్కర్ బీసీసీఐ ఛీప్ సెలక్టర్‌గా తన మార్క్‌ను చూపించాడు. అతడి పదవీకాలంలో టీమిండియా టీ20 ప్రపంచకప్-2024, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. అదేవిధంగా వన్డే ప్రపంచకప్-2023 రన్నరప్‌గా కూడా మెన్ ఇన్ బ్లూ నిలిచింది.
అయితే ప్రస్తుత సెలక్షన్ కమిటీలో ఓ మార్పు చోటు చేసుకోనున్నట్లు తెలుస్తోంది. శ్రీధరన్ శరత్ స్దానంలో మరో కొత్త వ్యక్తికి అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. కాగా శరత్ జనవరి 2023లో సీనియర్ సెలక్షన్ కమిటీకి పదోన్నతి పొందారు. ప్రస్తుత సెలక్షన్ కమిటీలో అగార్కర్, ఎస్ఎస్ దాస్, సుబ్రతో బెనర్జీ, అజయ్ రాత్రా, ఎస్ శరత్ ఉన్నారు.
చదవండి: టీమిండియా వన్డే కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్?