
భారత క్రికెట్ జట్టుకు ప్రస్తుతం మూడు ఫార్మాట్లలో వెర్వేరు కెప్టెన్‌లు ఉన్న సంగతి తెలిసిందే. వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ కొనసాగుతుండగా.. టెస్టు, టీ20 జట్ల సారథులుగా శుబ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.
అయితే ఇప్పటికే టెస్టు, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ త్వరలో వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పే అవకాశముంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ వారుసుడిగా వన్డే జట్టు పగ్గాలు ఎవరు చేపడతారన్న ఆసక్తి అందరిలోనే నెలకొంది. భారత వన్డే కెప్టెన్సీ రేసులో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ముందంజలో ఉన్నట్టు సమాచారం.
రోహిత్ తర్వాత అయ్యర్ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. కాగా ప్రస్తుతం 50 ఓవర్ల ఫార్మాట్‌లో రోహిత్ డిప్యూటీగా శుబ్‌మన్ గిల్ ఉన్నాడు. అయితే వర్క్‌లోడ్ మెనెజ్‌మెంట్‌లో భాగంగా వన్డే కెప్టెన్‌గా గిల్‌ను కాదని అయ్యర్‌ను నియమించాలని బీసీసీఐ పెద్దలు యోచిస్తున్నరంట.
కాగా ఇటీవ ఆసియాకప్‌కు ప్రకటించిన భారత జట్టులో శ్రేయస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. అన్ని ఫార్మాట్లలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ముంబై బ్యాటర్‌ను సెలక్ట్ చేయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి.
"ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి ముందు పరిస్థితులు బట్టి గిల్‌ను వన్డే వైస్ కెప్టెన్‌గా నియమించడం జరిగింది. కానీ రాబోయో కాలంలో భారత క్రికెట్ జట్టు వరుస ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐసీసీ ఈవెంట్లతో బీజీగా గడపనుంది. కాబట్టి మూడు ఫార్మాట్లలో ఒకే ఆటగాడు కెప్టెన్‌గా ఉండడం అసాధ్యం.
అందుకే గిల్‌ను టెస్టు కెప్టెన్సీతో పాటు టీ20ల్లో వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాము. భవిష్యత్తులో అతడు టీ20 కెప్టెన్ అయ్యే అవకాశముంది. కానీ వన్డే కెప్టెన్సీ విషయంలో మాత్రం బీసీసీఐ ప్రణాళికలు మరో విధంగా ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ వంటి ఆటగాళ్లు కెప్టెన్సీ రేసులో ఉన్నారని " దైనిక్ జాగరణ్ తమ రిపోర్ట్‌లో పేర్కొంది.
కాగా శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరించలేదు. కానీ దేశవాళీ క్రికెట్‌లో మాత్రం కెప్టెన్‌గా అతడికి అపారమైన అనుభవం ఉంది. ముంబై జట్టుకు అతడు సారథ్యం వహించాడు. 2024/25 విజయ్ హజారే ట్రోఫీలో ముంబై జట్టును అయ్యర్ నడిపించాడు. ఈ టోర్నీలో అతడు ను 5 మ్యాచ్‌ల్లో 325 పరుగులు సాధించాడు. 2024 సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో అయ్యర్ ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి టైటిల్‌ను అందించాడు.
చదవండి: CPL 2025: పొలార్డ్ మెరుపులు వృథా.. ఉత్కంఠ పోరులో నైట్ రైడర్స్ ఓటమి