టీమిండియా యువ ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా తరుచూ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ సపోర్ట్ వల్లే అతడికి మూడో ఫార్మాట్లలో ఆడే అవకాశం దక్కుతుందని చాలా మంది మాజీ క్రికెటర్లు సైతం విమర్శించారు. ఈ ఢిల్లీ ఆల్‌రౌండర్ టెస్టులకు దూరంగా ఉంటున్నప్పటికి.. భారత పరిమిత ఓవర్ల జట్టులో మాత్రం రెగ్యూలర్ సభ్యునిగా కొనసాగుతున్నాడు.
హర్షిత్ టీ20ల్లో పెద్దగా రాణించికపోయినప్పటికి.. వన్డేల్లో మాత్రం అద్భుత ప్రదర్శన చేస్తూ విమర్శకుల నోళ్లు మూయిస్తున్నాడు. అయినప్పటికి ఏదో ఒక విధంగా అతడు ట్రోల్స్‌కు గురువుతున్నాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హర్షిత్ రాణా తన కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నాడు.
"వైఫల్యాలను ఎలా ఎదుర్కోవాలో ఇప్పుడు నాకు బాగా తెలుసు. దాదాపు పదేళ్ల పాటు సెలక్షన్లలో నాకు నిరాశే ఎదురైంది. ఎన్నో ట్రయల్స్‌కు వెళ్లేవాడిని, కానీ ఫైనల్ లిస్ట్‌లో నా పేరు ఉండేది కాదు. ఇంటికి తిరిగి వచ్చి మా నాన్న ముందు ప్రతిరోజూ ఏడ్చేవాడిని. ఇప్పుడు ఏలాంటి వైఫల్యం ఎదురైనా దానిని తట్టుకోగలను.
ఒకానొక దశలో క్రికెట్‌ను వదిలేయాలని అనుకున్నా. కానీ మా నాన్న ఇచ్చిన ప్రోత్సాహంతోనే మళ్లీ తిరిగి నిలబడ్డా" అని హర్షిత్ పేర్కొన్నాడు. కాగా ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో కూడా హర్షిత్ మెరుగైన ప్రదర్శన చేశాడు. ఇప్పటి వరకు ఓవరాల్‌గా 13 వన్డేలు ఆడిన హర్షిత్ రాణా 23 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్-2026 భారత జట్టులో కూడా రాణా సభ్యునిగా ఉన్నాడు.


