
భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దినేష్ కార్తీక్ ఆల్‌టైమ్ ఇండియా టీ20 ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకున్నాడు. ఈ జట్టులో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, ఎంఎస్ ధోని, యువరాజ్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాల వంటి స్టార్ క్రికెటర్లకు కార్తీక్ చోటు ఇచ్చాడు.
అదేవిధంగా యువ ఆటగాడు అభిషేక్ శర్మకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ జట్టు కెప్టెన్‌గా ధోనిని డికే ఎంపిక చేశాడు. కార్తీక్ ఇటీవలే క్రిక్‌బజ్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా టీమిండియా ఆల్‌టైమ్ టీ20 ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంచుకోమని హోస్ట్ అడిగాడు.
"అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో గత రెండేళ్లగా దుమ్ములేపుతున్న ఆటగాడితో నా ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రారంభిస్తాను. అతడు యువ బ్యాటర్ అభిషేక్ శర్మ. అభిషేక్‌కు అద్బుతమైన టాలెంట్ ఉంది. భవిష్యత్తులో అతడు సూపర్ స్టార్ అవుతాడు. టీ20 ఫార్మాట్‌కు అతడి సరిగ్గా సరిపోతాడు.
అభి బంతితో కూడా రాణించగలడు. నా జట్టులో అభిషేక్‌తో పాటు రోహిత్ శర్మను ఓపెనర్లగా ఎంచుకుంటాను. మూడు, నాలుగు స్ధానాల్లో కోహ్లి, సూర్యకు ఛాన్స్ ఇవ్వాలనకుంటున్నాను. ఐదో స్ధానంలో యువరాజ్ సింగ్.. ఆల్‌రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌కు చోటు ఇస్తాను. వికెట్ కీపర్‌గా ధోనిని ఫిక్స్ చేస్తాను.
అంతేకాకుండా నా ఆల్‌టైమ్ జట్టుకు ధోనినే కెప్టెన్. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తికి అవకాశమిస్తాను. చివరగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌కు కుమార్‌లకు ఛాన్స్ ఇస్తానని" కార్తీక్ పేర్కొన్నాడు. కాగా తొట్ట తొలి టీ20 వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టులో భాగమైన గౌతమ్ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్‌లకు కార్తీక్ చోటు ఇవ్వకపోవడం గమనార్హం. అదేవిధంగా వరల్డ్ టీ20 నంబర్ వన్ బౌలర్ అర్ష్‌దీప్‌ను కూడా డికే పరిగణలోకి తీసుకోలేదు.
కార్తీక్ ఎంచుకున్న ఆల్‌టైమ్ భారత టీ20 ప్లేయింగ్ ఎలెవన్
అభిషేక్ శర్మ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోని (కెప్టెన్ అండ్ వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్
చదవండి: భారత జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. బీసీసీఐ ప్రకటన