
ఆసియాకప్-2025లో తమ తొలి మ్యాచ్‌కు టీమిండియా సిద్దమైంది. సెప్టెంబర్ 10న అబుదాబి వేదికగా యూఈఏతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో యూఏఈతో మ్యాచ్‌కు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌ను భారత మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అంచనా వేశాడు.
తన ఎంచుకున్న తుది జట్టులో ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ జట్టులో సంజూ శాంసన్‌కు మాత్రం చోటు దక్కలేదు. అతడి స్ధానంలో వికెట్ కీపర్ బ్యాటర్‌గా జితేష్ శర్మను శ్రీకాంత్ ఎంపిక చేశాడు. మిడిలార్డర్‌లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబేలతో అతడు వెళ్లాడు.
తిలక్ వర్మ ప్రస్తుతం అద్బుతమైన ఫామ్‌లో ఉన్నాడు. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌తో పాటు ఐపీఎల్-2025లో దుమ్ములేపాడు. దీంతో అతడికి భారత తుది జట్టులో చోటు ఖాయం. ఇక ఆల్‌రౌండర్లగా హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌కు ఈ తమిళనాడు క్రికెటర్ అవకాశమిచ్చాడు.
అదేవిధంగా ఫాస్ట్ బౌలర్ల కోటాలో జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్‌లకు చోటు దక్కింది. ఇక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తికి ఛాన్స్ లభించింది. అయితే గిల్ తిరిగి రావడంతో తుది జట్టులో సంజూ శాంసన్ స్దానంపై సందిగ్ధం కొనసాగుతోంది.
కానీ మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడిన భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం శాంసన్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందన్న సంకేతాలు ఇచ్చాడు. సంజూ ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో దుమ్ములేపుతున్నాడు.
ఐపీఎల్-2025తో పాటు కేరళ క్రికెట్ లీగ్ టోర్నీలోనూ మెరుగైన ప్రదర్శన చేశాడు. మరోవైపు జితేష్ కూడా ఐపీఎల్‌లో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు చేశాడు. టీమ్ మెనెజ్‌మెంట్‌కు ఇదొక కఠిన సవాల్ అనే చెప్పుకోవాలి. మరి సూర్య అండ్ గంభీర్ ఎవరివైపు మొగ్గు చూపుతారో బుధవారం వరకు వేచి చూడాల్సిందే.
యూఏఈతో మ్యాచ్‌కు శ్రీకాంత్ అంచనా వేసిన భారత తుది జట్టు: అభిషేక్ శర్మ, శుబ్‌మన్ గిల్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శివమ్ దూబే, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్
చదవండి: IND vs AUS: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఆ సిరీస్‌కు కోహ్లి-రోహిత్ దూరం!?