
భారత వన్డే జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మ స్ధానంలో యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్‌ను బీసీసీఐ నియమించిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా టూర్‌కు ముందు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. దీంతో చాలా మంది సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టారు.
రోహిత్‌ను కావాలనే కెప్టెన్సీ నుంచి తప్పించారని విమర్శించారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌ను వన్డే కెప్టెన్‌గా ఉద్దేశపూర్వకంగానే తొలగించారనే వాదనను గంగూలీ తోసిపుచ్చాడు. ప్రతీ కెప్టెన్‌కు కెరీర్ ఎండ్ సమయంలో ఇలా జరుగుతుందని దాదా అభిప్రాయపడ్డాడు. రోహిత్ ఇకపై వన్డే జట్టులో ప్లేయర్‌గా కొనసాగనున్నాడు. అయితే వన్డే ప్రపంచకప్-2027లో హిట్‌మ్యాన్ ఆడుతాడో లేదో ఇంకా స్పష్టత లేదు.
"రోహిత్‌తో మాట్లాడిన తర్వాతే సెలక్టర్లు ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు. ఉద్దేశపూర్వకంగా అయితే అతడిని తప్పించి ఉండరు. రోహిత్, సెలక్టర్ల మధ్య పరస్పర అంగీకారంతోనే ఈ మార్పు చోటు చేసుకుందని అనుకుంటున్నా. రోహిత్ ఒక అద్భుతమైన కెప్టెన్. అతడు భారత్‌కు టీ20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్‌ను అందించాడు.
వ్యక్తిగత ప్రదర్శన పరంగా కూడా రోహిత్ ముందంజలో ఉన్నాడు. ఇక్కడ రోహిత్ కెప్టెన్సీ, ఫెర్మామ్మెన్స్ సమస్య కాదు. 2027 నాటికి రోహిత్‌కు 40 ఏళ్లు వస్తాయి. క్రికెట్‌లో వయస్సు పరంగా అది చాలా ఎక్కవ నంబర్. కెరీర్ ఆఖరిలో ప్రతీ కెప్టెన్‌కు ఇలానే జరుగుతోంది. నాకు,ద్రవిడ్‌కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది.
శుబ్‌మన్ గిల్ కూడా 40 ఏళ్ల వయస్సులో ఇదే పరిస్థితిని ఎదుర్కొంటాడు. జేంటిల్‌మ్యాన్ గేమ్‌లో ప్రతీ ఒక్కరు ఏదో రోజున తమ కెరీర్‌ను ముగించాల్సిందే. గిల్‌ను కెప్టెన్‌గా ప్రమోట్ చేయడం సరైన నిర్ణయమే. అతడు ఇంగ్లండ్ టూర్‌లో అద్భుతంగా జట్టును నడిపించాడు. కెప్టెన్‌గా గిల్ ఎదిగే వరకు రోహిత్ ఆడుతూనే ఉండవచ్చు" ఓ ఇంటర్వ్యూలో గంగూలీ పేర్కొన్నాడు.
చదవండి: కెప్టెన్‌గా శార్ధూల్ ఠాకూర్.. సర్ఫరాజ్ ఖాన్ రీ ఎంట్రీ! నో సూర్య కుమార్?